Kaveri River: కన్నెర్ర జేసిన కావేరి.. నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరిక.. 11 జిల్లాలకు హై అలెర్ట్‌

|

Jul 16, 2022 | 12:57 PM

కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కావేరీకి వరద పోటెత్తుతోంది. నది పరివాహాక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పోటెత్తిన కావేరీ వరద ఉధృతి నేపథ్యంలో ధర్మపురి,..

Kaveri River: కన్నెర్ర జేసిన కావేరి.. నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరిక.. 11 జిల్లాలకు హై అలెర్ట్‌
Kaveri River
Follow us on

Kaveri River: విస్తారంగా కురిసిన వర్షాలతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కావేరిలో నీటి ప్రవాహం అంతకంత కూ పెరుగుతోంది. కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కావేరీకి వరద పోటెత్తుతోంది. నది పరివాహాక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పోటెత్తిన కావేరీ వరద ఉధృతి నేపథ్యంలో ధర్మపురి , ఈరోడ్ , సేలం జిల్లాలతో సహా 11 జిల్లాకు హై అలెర్ట్ జారీ చేశారు. కావేరీ నది పరివాహక ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మెట్టూరు డాం నుంచి నీటిని దిగువకు విడుదల చేయనున్న అధికారులు. మెట్టూరు డ్యాంలో లక్ష క్యూబిక్ అడుగులకు పైగా నీరు విడుదలయ్యే అవకాశం ఉన్నందున, ఈరోడ్ జిల్లాలోని భవానీ కావేరి తీరప్రాంత ప్రజలకు వరద హెచ్చరిక జారీ చేశారు.

మెట్టూరు డ్యాం నీటిమట్టం 109.51 అడుగులకు పెరిగింది. మెట్టూరు డ్యాం మొత్తం ఎత్తు 120 అడుగులు. డ్యాంకు నీటి ప్రవాహం పెరగడంతో నీటిమట్టం పెరుగుతూనే ఉంది. డ్యాం నుంచి ఇప్పటికే సాగునీటి కోసం సెకనుకు 15,550 ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు.

మరోవైపు, హొగెనక్కల్ జలపాతాలను అధికారులు మూసివేశారు. కెఆర్ఎస్ , కబిని డ్యాం నుంచి లక్ష 15 వేల కుసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం తో తమిళనాడు కి వరద ముప్పు తప్పటం లేదు. ఇప్పటికే గ్రామాలలో ఇల్లు ఖాళీ చేయాలనీ దండోరా వేయించారు అధికారులు . నది పరివాహక ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కావేరీ వరద ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి వివరాలు ప్రభుత్వానికి అందించాలని జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే, ప్రతికూల వాతావరణం కారణంగా కావేరీ నది ఒడ్డున వరదలో చిక్కుకున్న ఆరుగురిని ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి