Asaram Bapu Bail Petition: తాను కరోనాతో బాధపడుతున్నానని, చికిత్స చేయించుకునేందుకు బెయిల్ ఇప్పించడని వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ వేడుకుంటున్నారు. పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి యావజ్జీర కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆశారాం రాజ్‌స్థాన్ హైకోర్టులో బెయిలు పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చికిత్స చేయించుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఆశారారం కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన జోథ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్సపొందుతున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టకపోవడంతో మెరుగైన చికిత్స కావాలని ఆశారాం కోరుతున్నారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినందున ఆయుర్వేద చికిత్స తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఆయన తన బెయిలు దరఖాస్తులో తెలిపారు. గత బుధవారంనాడు శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కోవడంతో తొలుత మధుర దాస్ మథుర్ ఆసుపత్రిలో ఆయనను చేర్చించారు. ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో శుక్రవారంనాడు ఎయిమ్స్‌కు తరలించారు. జోథ్‌పూర్ జైలులో ఆశారాం సహా 12 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కాగా, ఆశారాం బెయిలు అభ్యర్థనపై ఈనెల 13న విచారణ జరగనుంది.