Chenab River: చీనాబ్ నీటికి అడ్డుకట్ట.. భారత్‌ నిర్ణయంతో ఖరీఫ్‌ నుంచే పాక్‌కు నీటి కష్టాలు!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌కు నీటి కొరత ఏర్పడుతున్నది. ముఖ్యంగా చీనాబ్ నదిపై నీటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకోవడం వల్ల ఖరీఫ్ సీజన్‌లో 21% వరకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

Chenab River: చీనాబ్ నీటికి అడ్డుకట్ట.. భారత్‌ నిర్ణయంతో ఖరీఫ్‌ నుంచే పాక్‌కు నీటి కష్టాలు!
Chenab River

Updated on: May 06, 2025 | 12:18 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా భారత్‌-పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం దాయాది దేశానికి నీటి కష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్తాన్‌పై ఈ ఎఫెక్ట్ కనిపించనుంది. ఈ నిర్ణయం మేరకు చీనాబ్ న‌దిపై నీటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంది. భారత్‌ చీనాబ్‌ నది నుంచి వెళ్లే నీటిన ఒక్కసారిగా ఆపేయ‌డంతో.. దాయాది దేశానికి ఖ‌రీఫ్ సీజ‌న్‌ నాటికి తీవ్ర నీటి కొర‌త ఏర్పడే అవ‌కాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ నిర్ణయంతో పాకిస్తాన్‌కు వెళ్లే నీటిలో సుమారు 21 శాతం మేర నీటి కొరత ఏర్పడవచ్చని ఇండస్‌ రివర్‌ సిస్టమ్‌ అథారిటీ అంచనా వేసింది.

పలహ్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు బుద్ది చెప్పాలనే నిర్ణయంతో భారత్‌ 1960 నాటి సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపి వేసింది. దీంతో భారత్‌ నుంచి పాక్‌కు వెళ్లే నీటిని అడ్డుకుంది. సలాల, బగ్‌లిహార్‌ డ్యామ్‌ల గేట్లు మూసేయడంతో పాక్‌కు వెళ్లే నీరు చాలావరకు తగ్గింది. దీంతో పాకిస్థాన్‌లో నీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు కిషన్‌ గంగాపై కూడా ఇలాంటి చర్యనే తీసుకోవాలని భారత్‌ భావిస్తోంది.

అయితే రాబోయే ఖరీఫ్ సీజన్‌కు నీటి లభ్యతను అంచనా వేసేందుకు ఐఎస్‌ఆర్‌ఏ సమావేశం నిర్వహించింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో ఖరీఫ్ ప్రారంభ దశలో పాకిస్తాన్‌కు వచ్చే నీటిలో సుమారు 21 శాతం నీరు తగ్గినట్లు సమావేశంలో అధికారులు అంచనా వేశారు. అయితే మరాల వద్ద చీనాబ్‌ నదిలో నీటి లభ్యత పడిపోవడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. సలాల్‌, బగ్‌లిహార్‌ డ్యామ్‌ల మూసివేతే ఈ పరిస్థితిక కారనంగా తెలుస్తోంది.

ముఖ్యంగా పాకిస్తాన్‌ వ్యవసాయంలో చాలా శాతం చీనాబ్‌ నది నీటిపైనే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ నదిపైనే ఎక్కువ కెనాల్స్ ఉన్నాయి. అయితే ఈ కెనాల్స్‌ నుంచి వెళ్లే నీటినే పాకిస్తాన్‌లోని ప్రజలు వ్యవసాయానికి వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు భారత్‌ చీనాబ్‌ నదిపై నీటిని ఆపేయడంతో పాకిస్థాన్‌కు నీటి కష్టాలు మొదలయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..