Indo Israel Agricultural Program: రక్షణ పరికరాలకు పేరుగాంచిన ఇజ్రాయిల్ భారతదేశంలో వ్యవసాయ వృద్ధికి తన సహకారాన్ని మరింత పెంచనుంది. వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ కూడా చాలా ముందుంది. ఈ దేశం 1993 నుండి ఈ రంగంలో భారతదేశానికి మద్దతు ఇస్తూవస్తోంది. ఈరెండు దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సహకారం పెంచడానికి గాను, మరోసారి 3 సంవత్సరాల కార్యక్రమంపై ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల నడుమ సాంకేతిక మార్పిడి, ఉద్యానవన ఉత్పాదకత, నాణ్యతను బాగా మెరుగుపరుస్తుంది. ఇది రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. ఒక కార్యక్రమంలో, వ్యవసాయం, నీటి రంగంపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని అంగీకరించి, రెండు ప్రభుత్వాలు మరింత సహకారాన్ని పెంచడానికి అంగీకరించాయి.
కొత్త కార్యక్రమంలో ఏమి జరుగుతుంది?
ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, ఈ 5 వ ఐఐఏపీ (ఇండో-ఇజ్రాయిల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్) సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ హార్టికల్చర్ రంగంలోని వ్యవసాయ సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుంది. మొదటి ఐఐఏపీ 2008 లో 3 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటివరకు, 4 కార్యాచరణ ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేసాము. ఇజ్రాయిల్ టెక్నిక్స్ ఆధారంగా ఈ ప్రణాళికల క్రింద స్థాపించబడిన సీఒయి(సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్)లు ఇప్పటివరకు చాలా విజయవంతమయ్యాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
రైతులకు ప్రయోజనం ఉంటుంది
భారతదేశంలో ఇజ్రాయిల్ రాయబారి డాక్టర్ రాన్ మలకా మాట్లాడుతూ ఈ మూడేళ్ల కార్యక్రమం రెండు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్య బలాన్ని చూపుతుంది. ఇది స్థానిక రైతులకు మేలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, కైలాష్ చౌదరి పాల్గొన్నారు. వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, కొత్త కార్యక్రమం సందర్భంగా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చుట్టూ ఉన్న గ్రామాలను ఎక్సలెన్స్ గ్రామాలుగా మార్చడంపై మా దృష్టి ఉంటుంది. ఇజ్రాయెల్ రక్షణ రంగంలో అలాగే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో చాలా ముందు ఉంది. ప్రస్తుతం ఇజ్రాయిల్ భారత్ ల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇజ్రాయిల్‌తో భారతదేశంలో వ్యవసాయ కార్యక్రమం
చైనాలో హైబ్రిడ్ రైస్ ‘మూల పితామహుడు’ యువాన్ లాంగ్ పింగ్ కన్నుమూత, కోట్లాది ప్రజల అశ్రు నివాళి…