Ayodhya: అయోధ్యకు బయలుదేరిన మొదటి విమానం.. “జై శ్రీ రామ్” అంటూ ప్రయాణికులకు స్వాగతం పలికిన పైలట్

అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ప్రారంభించారు. దీంతో మొదటి విమానం ఢిల్లీ నుండి అయోధ్య నగరానికి బయలుదేరింది. ఈ సందర్భంగా ఇండిగో విమాన పైలట్‌ కెప్టెన్‌ అశుతోష్‌ శేఖర్‌ 'జై శ్రీరామ్‌' అంటూ ప్రయాణికులకు స్వాగతం పలికారు.

Ayodhya: అయోధ్యకు బయలుదేరిన మొదటి విమానం.. జై శ్రీ రామ్ అంటూ ప్రయాణికులకు స్వాగతం పలికిన పైలట్
First Flight

Updated on: Dec 30, 2023 | 7:24 PM

అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ప్రారంభించారు. దీంతో మొదటి విమానం ఢిల్లీ నుండి అయోధ్య నగరానికి బయలుదేరింది. ఈ సందర్భంగా ఇండిగో విమాన పైలట్‌ కెప్టెన్‌ అశుతోష్‌ శేఖర్‌ ‘జై శ్రీరామ్‌’ అంటూ ప్రయాణికులకు స్వాగతం పలికారు. వార్తా సంస్థ ANI తన వీడియోను పంచుకుంది. అందులో పైలట్ ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.

అయోధ్య ధామ్‌కు ప్రయాణంలో విమానంలో ప్రజలు హనుమాన్ చాలీసా పఠిస్తున్నట్లు కనిపించారు. అదే సమయంలో, విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై కదులుతున్న వెంటనే, ప్రయాణికుల నుండి జై శ్రీరామ్ నినాదాలు ప్రతిధ్వనించాయి. ఇందుకు సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సం జరగనుండడంతో రామభక్తుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చాలా మంది రామభక్తులు అయోధ్యకు పయనమయ్యారు. అయోధ్యకు తొలి విమానంలో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తమ అనుభవాలను పంచుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఒక ప్రయాణికుడు, “అయోధ్యకు వెళ్లడానికి చాలా సంతోషిస్తున్నాము. మా పిల్లలను కూడా వెంట తీసుకెళ్తున్నాము.” రామ్‌లాలాను చూసేందుకు, ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి అయోధ్య వెళ్తున్నామన్నారు.

కర్ణాటకకు చెందిన మరో ప్రయాణికుడు అయోధ్యకు తొలి విమానం ఎక్కినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు . జైన మత గురువు రవీంద్ర కీర్తి స్వామి, మొదటి విమానంలో ప్రయాణించే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీనిని చారిత్రాత్మక రోజుగా పేర్కొన్నారు.

ఇది కల సాకారమైనట్లేనని జైన వర్గానికి చెందిన మరో ప్రయాణికుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ “మహా రామాలయం పూర్తవుతోంది. ఇది చాలా కాలంగా కల. ఇప్పుడు అది రియాలిటీకి దగ్గరగా ఉంది. రామ్‌లాలా ఆశీస్సులు పొందబోతున్నామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…