Kambala Srinivas Gowda : కంబళ హీరో ఓడిపోయాడు.. ట్రాక్​ మధ్యలోనే పడిపోయాడు భారత ‘హుస్సేన్​ బోల్ట్​’

కంబళ హీరో ఓడిపోయాడు. 100 మీటర్లను 9.55 సెకన్లలో పరిగెత్తి గతేడాది సంచలనం సృష్టించిన శ్రీనివాస గౌడ.. ఈ ఏడాది మధ్యలోనే డీలాపడ్డాడు. కర్ణాటక మంగళూరులోని..

Kambala Srinivas Gowda : కంబళ హీరో ఓడిపోయాడు.. ట్రాక్​ మధ్యలోనే పడిపోయాడు భారత హుస్సేన్​ బోల్ట్​

Updated on: Feb 01, 2021 | 9:57 PM

Kambala Srinivas Gowda : కంబళ హీరో ఓడిపోయాడు. 100 మీటర్లను 9.55 సెకన్లలో పరిగెత్తి గతేడాది సంచలనం సృష్టించిన శ్రీనివాస గౌడ.. ఈ ఏడాది మధ్యలోనే డీలాపడ్డాడు. కర్ణాటక మంగళూరులోని హొక్కాడిగోలిలో నిర్వహించిన పోటీల్లో భారత ‘హుస్సేన్​ బోల్ట్​’ తడబడ్డాడు.

గతేడాది లాగే.. ఈసారి కూడా బురద మళ్లలో పోటీలను కంబళ కమిటీ నిర్వహించింది. జనవరి 30-31 రెండు రోజులపాటు ఈ పోటీలు జరిగాయి. తన దున్నలతో పరుగు ప్రారంభించిన శ్రీనివాస గౌడ ట్రాక్​ మధ్యలోనే పడిపోయాడు. అతని శరీరం, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస గౌడ కోలుకోవడానికి 3-4 రోజుల్లో పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నెల 6న కాంతబారె, బోడబారె కంబళ పోటీల్లో గౌడ పాలుగొంటాడని ఆ జట్టు సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

Captain Tom Moore : వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్‌కు కరోనా పాజిటివ్.. బెడ్‌ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స

Bandi Sanjay : మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా నిర్మలమ్మ బడ్జెట్.. పొగచూరిన జీవితాలకు ఇది వెలుగు రేఖ..