Sugar Price: చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!

దేశంలో చక్కెర ధరల పెరుగుదలపై జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చెరుకు ఉత్పత్తిని ఇథనాల్ తయారికి మళ్లించడంతోనే చక్కెర కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయన్న ప్రచారంతో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇది పండుగ సీజన్ నేపథ్యంలో సాధారణంగా కనిపించే పెరుగుదలేనని స్పష్టం చేసింది. వాస్తవంగా చెప్పాలంటే 2023తో పోల్చుకుంటే ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించిన చక్కెర వాటా 2025–26 నాటికి సుమారు 9 శాతానికి తగ్గినట్టు తెలిపింది.

Sugar Price: చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
India Sugar Industry

Updated on: Aug 26, 2026 | 3:37 PM

దేశంలో చక్కెర ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇవి పండుగ సీజన్‌లో ఉండే సాధారణ పెరుగుదలేనని స్పష్టం చేసింది ప్రపంచంలో రెండో అతిపెద్ద చెరకు ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశంలో చక్కెర పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తిగా మారిందని.. దేశంలో దాదాపు 5 కోట్ల మంది రైతులు, 5 లక్షల మంది మిల్లు కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొంది. గతంలో పోల్చుకుంటే 2025-26లో చెరకు ఉత్పత్తి 500 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరిందని.. గత దశాబ్దంలో ఇది సుమారు 43.5శాతం వృద్ధిని క్రియేట్ చేసినట్టు తెలిపింది.

2026-27 సీజన్‌కు గాను కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ చెరకుకు కనీస మద్దతు ధరను రూ.365గా నిర్ణయించిందని.. మన దేశంలో ఉత్పత్తి అయిన చక్కెరను విదేశాలకు ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు అగ్రస్థానంలో ఉన్నాయన్నారు. అలాగే 2025-26లో మన దేశం నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర శ్రీలంక, పశ్చిమాసియా, తూర్పు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయిందని తెలిపారు.

ఇథనాల్ బ్లెండింగ్‌తో రైతులకు ఆర్థిక భరోసా

ఇవి కూడా చదవండి

అయితే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా ఇంధన భద్రత పెరగడమే కాకుండా చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి మెరుగైందని కేంద్ర స్పష్టం చేసింది. 2025-26 సీజన్‌కు సంబంధించి ఆగస్టు 2026 నాటికి రైతులకు అందాల్సిన బకాయిల్లో 97 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని పేర్కొంది. అలాగే గతంలో పోల్చుకుంటే ఇథనాల్‌ తయారీలో చెరుకు వాడకం చాలా వరకు తగ్గిందని.. ప్రస్తుతం చక్కెర తయారీ వాటా 9శాతానికి చేసందని తెలిపింది. సుమారు 75 శాతం ఇథనాల్‌ను మొక్కజొన్న తదితర ధాన్యాల నుంచే ఉత్పత్తి చేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాబట్టి దేశంలో చక్కెర వినియోగానికి ఎటువంటి కొరత లేదని.. ఏర్పడదని చెప్పుకొచ్చింది.

ధరల పెరుగుదల తాత్కాలికమే

గత నెల రోజుల్లో దేశీయ మార్కెట్‌లో కిలో చక్కెర ధర రూ.48.18 నుండి రూ. 55.70కి పెరిగింది. పండుగల సీజన్ డిమాండ్, అధిక వర్షాలు, తెగుళ్ల వల్ల ఉత్పత్తి 306 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం కావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన లోటు వ్యాపారుల నిల్వల కారణంగా ఈ ధరలు పెరిగాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉత్పత్తి అంచనాల కంటే కాస్త తగ్గినప్పటికీ.. దేశీయ అవసరాలకు సరిపడా చక్కెర నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాదు అక్టోబర్ నుంచి కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధరలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

చక్కెర నిల్వలు, ధరల నియంత్రణపై చర్యలు

దేశంలో తాత్కాలికంగా పెరిగిన చక్కెర ధరలను అదుపు చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలో అక్రమ నిల్వలను అరికట్టడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న చక్కెర డీలర్లపై ఆగస్టు 1, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు 400 టన్నుల గరిష్ట నిల్వ పరిమితిని విధించారు. అలాగే సెప్టెంబర్ 1, 2026 నుండి భారీ పరిమాణంలో చక్కెరను వినియోగించే సంస్థలు తమ 15 రోజుల వినియోగానికి మించి అదనపు నిల్వలు ఉంచుకోవద్దని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలను అరికట్టేందుకు మిల్లుల్లో అధికారులు నిరంతర తనిఖీలు చేస్తున్నారు.

అంతేకాదు పండుగల సీజన్‌లో కొరత లేకుండా చూసేందుకు అక్టోబర్ 15, 2026 నుంచే క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలు, మిల్లులను ఆదేశించారు. దీనివల్ల సాధారణంగా అక్టోబర్‌లో వచ్చే 3-4 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఏకంగా 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ధరల పెరుగుదల అనేది ఉత్పత్తి తగ్గుదల, పండుగల డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల ఏర్పడిన తాత్కాలిక పరిణామం మాత్రమేనని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us