Omicron Variant: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఒకే కుటుంబంలోని 9 మందికి పాజిటివ్..

|

Dec 05, 2021 | 8:27 PM

Omicron Variant Cases: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అలజడి సృష్టిస్తుంది. ఒక్కసారే పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో నిన్నటి వరకు ఐదు కేసులే..

Omicron Variant: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఒకే కుటుంబంలోని 9 మందికి పాజిటివ్..
Omicron
Follow us on

Omicron Variant Cases: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అలజడి సృష్టిస్తుంది. ఒక్కసారే పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో నిన్నటి వరకు ఐదు కేసులే.. నమోదవగా ఆదివారం భారీగా కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదుకాగా.. రాజస్తాన్‌లో తొమ్మిది నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. రాజస్థాన్‌ జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ అయింది. మొదట సౌతాఫ్రికా నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్‌ రాగా.. వారితో ఉన్న మరో ఐదుగురికి ఒమిక్రాన్‌ సంక్రమించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. బాధితులు 3న రాజస్థాన్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని ఒకే కుటుంబంలో 9మందికి ఒమిక్రాన్‌గా గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒమిక్రాన్‌ కేసులను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇప్పటికే మహారాష్ట్రలో ఒక కేసు నమోదవగా.. వీటితో మొత్తం సంఖ్య ఎనిమిదికి చేరింది. ఒకే రోజు మహారాష్ట్రలో ఏడుగురికి పాజిటివ్‌గా తేలడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఏడుగురు మహారాష్ట్రలోని పుణెకు చెందిన వారుగా పేర్కొంటున్నారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం సంఖ్య 21కి పెరిగింది. ఇంతకు ముందు బెంగళూరులో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా..  మహారాష్ట్ర లోని పింప్రీ చించ్వాడలో ఆరు, పుణేలో ఒక్క కేసు, రాజస్థాన్లో 9 నమోదయ్యాయి.

రోజురోజుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీకి అంతర్జాతీయ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేధించాలని కేంద్రానికి లేఖ రాశారు సీఎం కేజ్రీవాల్‌. కాగా.. దేశంలో 3 రోజుల్లోనే 21 ఒమిక్రాన్‌ కేసులు నమోదవ్వడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

Also Read:

Crime News: కసితీరా.. ఇంట్లో ఆ ఇద్దరినీ అలా చూసిన తండ్రి ఏం చేశాడంటే..?

Nurse: రోడ్డు ప్రమాదంలో చావు అంచుల్లోకి విద్యార్థి.. ఊపిరిపోసిన ‘నర్సమ్మ’.. ఫిదా అవుతున్న నెటిజన్లు..