పాక్ బండారం బయటపెట్టేందుకు.. ఎంతమంది ఎంపీలు ఏఏ దేశాలకు వెళ్తున్నారు? పూర్తి వివరాలు..
భారత పార్లమెంటు సభ్యులు పాకిస్థాన్ ఉగ్రవాద మద్దతును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికి విదేశాలకు పర్యటించనున్నారు. ఆపరేషన్ సింధుదుర్గ్ తరువాత, ఉగ్రవాదానికి సున్నా సహనం అనే భారతదేశ దృఢమైన వైఖరిని ప్రచారం చేయనున్నారు. మరి ఎన్ని బృందాలు వెళ్తున్నాయి? ఏ బృందంలో ఎవరున్నారు? ఎవరు ఏ దేశానికి వెళ్తున్నారో ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తుందనే విషయాలు చెప్పి, అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పలువురు పార్లమెంట్ సభ్యులు విదేశాలకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆపరేషన్ సిందూర్ తర్వాత ఒక ప్రధాన దౌత్య చర్యలో భాగంగా ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్‌పై ఇండియా దృఢమైన వైఖరిని తెలియజేయనున్నారు. అలాగే గత నెలలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆయా దేశాలకు వివరించనున్నారు.
పార్టీలకు అతీతంగా 59 మంది రాజకీయ నాయకులు, ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొనే దౌత్య కార్యక్రమం బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయంతో సహా 32 దేశాలకు వెళ్లనున్నారు. ప్రతి ప్రతినిధి బృందంలో ఏడుగురు లేదా ఎనిమిది మంది నేతలు ఉన్నారు. వారికి మాజీ దౌత్యవేత్తలు సహాయం చేస్తారు. ఏడు ప్రతినిధి బృందాలలో కలిపి 59 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుండి 31 మంది, ఇతర పార్టీల నుండి 20 మంది ఉన్నారు. ఏడు ప్రతినిధి బృందాల్లోనూ కనీసం ఒక ముస్లిం వ్యక్తి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఎవరు ఏ దేశాలకు వెళ్తున్నారు? ఎవరు ఏ గ్రూప్‌లో ఉన్నారో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
గ్రూప్-1
ప్రతినిధి బృందం నాయకుడు: బిజెపి ఎంపి బైజయంత్ పాండా
పర్యటించే దేశాలు: ఇండోనేషియా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్
గ్రూప్-4
ప్రతినిధి బృందం నాయకుడు: శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే
సభ్యులు: బన్సూరి స్వరాజ్ (BJP), ET మహమ్మద్ బషీర్ (IUML), అతుల్ గార్గ్ (BJP), సస్మిత్ పాత్ర (BJD), మనన్ కుమార్ మిశ్రా (BJP), SS అహ్లువాలియా, సుజన్ చినోయ్
పర్యటించే దేశాలు: యుఎఇ, లైబీరియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్