Global Anti-Terror Outreach: పాక్‌పై భారత్‌ దౌత్య యుద్ధం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 33 దేశాల్లో 59 మంది MPలు పర్యటన!

Pak-sponsored terrorism: అంతర్జాతీయంగా పాక్‌ని ఏకాకిని చేసేందుకు దౌత్యయుద్ధాన్ని మొదలుపెట్టింది భారత్‌. పాక్‌ దుశ్చర్యలను ఎండగట్టేందుకు, భారత్‌ విధానాన్ని వివరించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు పయనమవుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేయగా వాటిలో మూడింటితో సమావేశమయ్యారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ. జేడీయూ నేత సంజయ్‌ ఝా, శివసేన నేత శ్రీకాంత్‌ శిందే, డీఎంకే నాయకురాలు కనిమొళి నాయకత్వం వహిస్తున్న బృందాల ప్రతినిధులతో మిస్రీ ఈ భేటీ నిర్వహించారు..

Global Anti-Terror Outreach: పాక్‌పై భారత్‌ దౌత్య యుద్ధం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 33 దేశాల్లో 59 మంది MPలు పర్యటన!
Global Anti Terror Outreach

Updated on: May 21, 2025 | 11:18 AM

న్యూఢిల్లీ, మే 21: పహల్గామ్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పై దౌత్య యుద్ధానికి 59 మంది భారత ఎంపీలు రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తో భారత సైన్యం సత్తాను ప్రపంచానికి చాటిన భారత్.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్ర సంస్థలకు ఆశ్రయమిస్తున్న పాక్ తీరును అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఏడు బృందాలతో కూడిన 59 ఎంపీలు 33 దేశాల్లో పర్యటింకానున్నారు. ఆపరేషన్ భారత్ ద్వారా ఉగ్రవాదం పై భారత విధానాన్ని.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు ఏకతాటి పైకి రావాలన్న సందేశంతో పాకిస్తాన్ పై దౌత్య పోరాటాన్ని ఉదృతం చేయనుంది భారత్.

పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం.. . ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్(భాజపా), బైజయంత్ పాండా (భాజపా) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన) నేతల నేతృత్వంలో ఒక్కో బృందంలో 8- 9 మంది ఎంపీలు మొత్తంగా 59 మంది ఎంపీలు 33 దేశాల్లో పర్యటించనున్నారు.

7 అఖిలపక్ష ఎంపీల బృందాలు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి భారత్ వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు ఏంటి..? పాక్ బెదిరింపులకు దీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్ను ఎలా చేపట్టిందనేది ప్రపంచదేశాల ప్రతినిధులకు భారత ఎంపీల ప్రతినిధి బృందం వివరించనుంది. భవిష్యత్తులో భారత్ పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలను వివరించనున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని తెలపనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ అనుసరిస్తున్న పాత్రను దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును సైతం భారత ఎంపీలు విదేశీ నేతలకు వివరించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం విదేశాలకు వెళ్లే ఎంపీల బృందాలకు సమగ్ర సమాచారాన్ని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించనున్నారు..పార్లమెంట్ హౌస్‌లో రెండు దశల్లో ఎంపీల బృందాలకు పాకిస్తాన్ ఉగ్రవాద వివరాలు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలపనున్నారు..మే 20న సంజయ్ ఝా, కనిమొళి, శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి వివరాలు తెలిపింది. విదేశాంగశాఖ.. అనంతరం ఈ మూడు బృందాలు మే 21 – 23 మధ్య విదేశీ పర్యటనకు వెళతాయి. మే 23న మిగిలిన నాలుగు ప్రతినిధి బృందాల (శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, సుప్రియా సూలే, బైజయంత్ పాండా) సభ్యులకు సమాచారం ఇస్తారు విదేశాంగ కార్యదర్శి ఉగ్రవాద దాడులలో పాకిస్తాన్ ప్రమేయం గురించి ఆధారాలు, సమాచారం ఎంపీ ప్రతినిధి బృందాలకు విదేశాంగ కార్యదర్శి అందిస్తారు. అనంతరం మే 23 – 25 మధ్య విదేశీ పర్యటనకు వెళతాయి మిగిలిన నాలుగు బృందాలు..సుమారు 10 రోజులపాటు విదేశాల్లో పర్యటించి జూన్ మొదటి వారానికి తిరిగి భారత్ తిరిగిరానున్నారు .

33 దేశాల రాజధానులకు వెళ్లే ఏడు గ్రూపుల్లో 59 మంది ఎంపీలు ఉండగా మొత్తం 20 మంది బిజెపి ఎంపీలకు ఇందులో స్థానం దక్కింది..కేవలం ముగ్గురు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యత్వం లేని రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, మాజీ కేంద్రమంత్రి ఎం.జె. అక్బర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మానఖుర్షీద్, మాజీ ఎంపీ ఎస్ఎస్ ఆహ్లూవాలియాలకూ స్థానం కల్పించింది…కేంద్రం..విదేశాలకు వెళ్లే అఖిలపక్ష బృందంలో బిఆర్ఎస్, జనసేన ,వైసిపి సభ్యులకు స్థానం దక్కలేదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశ విధానాన్ని,చర్యలను వివిధ దేశాలకు తెలియపరచనున్న అఖిలపక్ష ప్రతినిధులు ఉగ్రవాదంపై భారత్ జీరో టోలరెన్స్ అనే బలమైన సందేశాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనున్నారు.

  • శశి థరూర్ నేతృత్వం లో 9 మంది సభ్యుల బృందం యుఎస్ఏ, పనామా, గుయానా, బ్రెజిల్, కొలంబియాలో పర్యటించనున్నారు.
  • రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం యుకె, ప్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ పర్యటించనున్నారు.
  • సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం ఇండోనేషియా, మలేషియా, కొరియా, జపాన్, సింగపూర్ లో పర్యటించనున్నారు.
  • బైజయంత్ పాండా నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలో పర్యటించనున్నారు.
  • కనిమొళి కరుణానిధి నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలో పర్యటించనున్నారు.
  • సుప్రియా సూలే నేతృత్వంలో 9 మంది సభ్యుల బృందం ఈజిప్ట్, కతార్, ఇతియోపియా, సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు.
  • శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం యూఏఈ, లైబీరియా, కాంగో, సియర్రాలో పర్యటించనున్నారు.

పాక్ పై భారత్ దౌత్య యుద్ధంలో భాగంగా ఏడు ఎంపీల అఖిలపక్ష బృందాలు ఉగ్రవాదానికి పాక్ అందిస్తున్న సాయం, ఆపరేషన్ సిందూర్‌ వివరాలు UN భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామి దేశాలకు ఏడుగురు ఎంపీల బృందాలు వివరిస్తాయి. ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్రం ఏర్పాటుచేసిన ఏడు అఖిలపక్ష ఎంపీల బృందాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి అవకాశం లభించింది. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీహెచ్ఎం బాలయోగి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలకు అఖిలపక్ష బృందంలో సభ్యులుగా స్థానం దక్కింది. యుకె, ప్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ లో పర్యటించనున్న బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటిస్తారు. ఈజిప్ట్, కతార్, ఇతియోపియా, సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు పర్యటిస్తారు. యుఎస్ఏ, పనామా, గుయానా, బ్రెజిల్, కొలంబియా లో పర్యటించనున్న టీడీపీ ఎంపీ జిఎం హరీష్ బలయోగి పర్యటిస్తారు. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలో పర్యటించనున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించనున్నారు.

ఏ బృందం ఏయే దేశాలకంటే..

  • అమెరికాకు శశిథరూర్‌ నేతృత్వంలోని బృందం
  • తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్‌ పాండా బృందం
  • రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం
  • ఆగ్నేయాసియాకు సంజయ్‌ ఝా బృందం
  • మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు రవిశంకర్‌ ప్రసాద్‌ బృందం
  • పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం
  • ఆఫ్రికన్‌ దేశాలకు శ్రీకాంత్‌ షిండే బృందం
  • అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌ నిజస్వరూపం
  • 33 దేశాల్లో పర్యటించనున్న భారత్‌ బృందాలు
  • ఏడుగురు ఎంపీల నేతృత్వంలో అఖిలపక్ష బృందాలు
  • దౌత్య యుద్ధంకోసం బయలుదేరిన మూడు బృందాలు
  • మూడు బృందాల ప్రతినిధులతో విక్రమ్‌ మిస్రీ భేటీ
  • తెలుగురాష్ట్రాలనుంచి కమిటీల్లో నలుగురికి చోటు

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ సైనిక చర్యతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పాకిస్తాన్ ఎయిర్ బేస్ ధ్వంసం సహా కోలుకోలేని దెబ్బ కొట్టడంతో కాల్పుల విరమణ కు ముందుకొచ్చింది భారత్. మొదటి నుంచి భారత పోరు ఉగ్రవాదం పైనే కానీ పాకిస్తాన్ సైన్యం పైన పాకిస్తాన్ ప్రజల పైన కాదన్న భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది..అయినా సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేత , ఆర్థిక వాణిజ్య ఆంక్షలు పాకిస్తాన్ పై భారత్ కొనసాగిస్తుంది..అందులో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందనేది తెలిపేందుకు దౌత్య పరమైన పోరాటాన్ని భారత్ ముమ్మరం చేస్తూ ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతూ ఆర్థికంగా,వాణిజ్య పరంగా ప్రపంచదేశాలతో సంబంధాల పరంగా మరిన్ని చిక్కులు సృష్టించబోతోంది భారత్. భారత్ పోరాటానికి తలొగ్గి ఉగ్ర సంస్థలు ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకుంటుందా లేక కయ్యానికి మరోసారి కాలుదువ్వుతుందా అనేది వేచిచూడాలి.

ఆపరేషన్‌ సింధూర్‌పై వివిధ దేశాల్లో అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష ప్రతినిధి బృందానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి మొదట ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌ని ఈ బృంద సభ్యుడిగా ఎంపిక చేసింది. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని మమతాబెనర్జీ వ్యతిరేకించటంతో యూసుఫ్‌ పఠాన్‌ బృందంనుంచి వైదొలిగారు. కాంగ్రెస్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా శశిథరూర్‌ ఆ పార్టీనుంచి ఓ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ ఎంపీలు లావు కృష్ణ దేవరాయలు, గంటి హరీష్‌మాధుర్‌కి విదేశాలకు వెళ్లే అఖిలపక్ష కమిటీల్లో చోటు దక్కింది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వాధినేతలతోపాటు పార్లమెంటేరియన్లు, మేథావులు, మీడియా సభ్యులను కలుస్తాయి. 59మంది సభ్యులతో కూడిన ఏడు అఖిలపక్ష బృందాలు 33 దేశాల్లో సుమారు 10 రోజులపాటు పర్యటిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.