ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం ఏ విధంగా దెబ్బ తింటుందో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి జీవ మనుగడకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం మంచికి ఉపయోగించాలని నోయిడా అధికారులు తలంచారు. అనుకున్నదే తడవుగా ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. అది కూడా మనదేశంలో తొలిసారి ఈ ప్రయోగానికి తెరలేపడం విశేషం.
.@BPCLimited व @noida_authority द्वारा से०-129, नौएडा-ग्रेनौ एक्सप्रेसवे के समानांतर 500मी० लम्बी सड़क बनाने में प्लास्टिक वेस्ट मॉड्यूल से भारत में प्रथम सड़क निर्माण पायलट प्रोजेक्ट का शुभारंभ किया।इस सड़क निर्माण में 35मैट्रिक टन प्लास्टिक वेस्ट का उपयोग होगा#PlasticFreeNoida pic.twitter.com/nqrY2KFnpR
— CEO, NOIDA Authority #IndiaFightsCorona (@CeoNoida) November 26, 2020
దేశంలోనే తొలిసారి నోయిడాలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నోయిడా నగర పాలక సంస్థ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. తొలుత నోయిడా 129 సెక్టార్ పరిధిలో 500 మీటర్ల మేర ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. దీనికి సంబంధించి నేడు శంకుస్థాపన కూడా చేశారు. 500 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టడానికి దాదాపు 35 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అవసరం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణం శంకుస్థాపనకు సంబంధించిన ఫోటోలను నోయిడా అథారిటీ సీఈవో రితూ మహేశ్వరి ట్వీట్ చేశారు.