
ఇక్కడ రెండు వర్షన్స్ ఉన్నాయి. ఎవరి వర్షన్ వారిదే. ఎవరో కష్టం బూడిదపాలు అవుతోందని టెక్నాలజీని వద్దంటామా అని కొందరు. టెక్నాలజీని స్వీకరిద్దాం.. బట్ ఎట్ వాట్ కాస్ట్ అని మరికొందరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గిబ్లీ ట్రెండ్ నడుస్తోంది. జస్ట్ ఫొటో అప్‌లోడ్ చేస్తే చాలు.. వెంటనే గిబ్లీ ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోతోంది. కాని, ఈ గిబ్లీ చరిత్ర ఏంటో తెలుసా మీకు. ఎంతమంది, ఎన్నాళ్లు, ఎంత కష్టపడితే గిబ్లీ ఆర్ట్ తయారవుతుందో తెలుసా. ఆ కళకు ప్రాణం పోసిన వ్యక్తి గురించి, ఆయన వల్ల ఉపాధి పొందుతున్న వందల మంది పరిస్థితి ఏం కాబోతోందో ఆలోచించారా ఎవరైనా? సరే.. ఆయన కష్టాన్ని పక్కనపెట్టండి. గిబ్లీ వల్ల మీ పర్సనల్ లైఫ్ ఎంత ప్రమాదంలో పడుతోందో ఆలోచించారా. ప్రతి ఒక్క మూమెంట్‌ను అప్‌లోడ్ చేస్తూ, గిబ్లీలు క్రియేట్ చేస్తూ, మరొకరికి షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు గానీ.. దానివెనకున్న ప్రమాదాన్ని ఊహించారా ఎవరైనా? గిబ్లీ ఇమేజెస్ ఈ ప్రపంచాన్ని ఎంత ప్రమాదంలోకి నెడుతోందో తెలుసుకుంటే.. ఇంకోసారి ఆ పేరే ఎత్తరు? అదొక్కటే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయబోతున్న వినాశనాన్ని కూడా తెలుసుకోవాలిక్కడ. ఆ ప్రయత్నమే చేద్దాం ఇవాళ్టి ఎక్స్‌క్లూజివ్‌లో. శామ్ ఆల్ట్‌మన్. ఈయనెవరో తెలుసుకునే ముందు ఎక్స్‌లో ఈయన పెట్టిన రిక్వెస్ట్ చూద్దాం. ‘ప్లీజ్ చిల్’.. మా టీమ్‌కు కూడా నిద్ర కావాలి కదా.. దయచేసి గిబ్లీలకు బ్రేక్ ఇవ్వండి’ అని వేడుకున్నాడు. ఎందుకంటే.....