రైలు ప్రయాణంలో మీ పిల్లలకు డైపర్స్ అయిపోయాయా? డోంట్ వర్రీ.. అండగా రైల్వే
ప్రయాణాలు కొందరికి సంతోషంగా అనిపించినా మరికొంత మందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణం చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. పసిపిల్లలతో ప్రయాణం చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక ఇలాంటి సమయంలో చిన్న పిల్లలకు మధ్యలోనే డైపర్స్ అయిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచదు. అయితే ఇలాంటి సంఘటనే ఓ ఫ్యామిలీ ఎదుర్కొంది. వారికి భారతీయ రైల్వే అండగా నిలిచింది. ఎలా అనుకుంటున్నారా?

దేబీ ప్రసాద్ అనే ప్రయాణికుడు, ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నాడు. తన ఆరు నెలల బాబుతో జర్నీ చేస్తుండగా మధ్యలో చిన్న సైజు డైపర్స్ అయిపోయాయి. దీంతో ఆ తండ్రికి ఏం చేయాలో తెలియలేదు. ఏం తోచలేదు. దీంతో ఆయన వెంటనే భారతీయ రైల్వే యొక్క అధికారిక ఫిర్యాదు పోర్టల్ అయిన RailMadad లో ఫిర్యాదు చేశాడు. ఉదయం 10:07 గంటలకు అతను కంప్లైంట్ రైజ్ చేశాడు. దీనికి భారతీయ రైల్వే నుంచి కేవలం నిమిషాల్లోనే స్పందన వచ్చింది.
ప్రయాణికుడు ఫిర్యాదు చేసిన కేవలం 10 నిమిషాల్లోనే RailMadad టీం, ప్యాంట్రీ కార్ మేనేజర్ నుండి అతనికి కాల్ వచ్చింది. మీరు మాకు యాప్ ద్వారా మీ సమస్యను తెలియజేశారు. మీరు చింతించకండి, మీకు గయా జంక్షన్ వద్ద బేబీ డైపర్స్ అందించడం జరుగుతాయి, ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం అంటూ సమాధానం వచ్చింది.
వారు చెప్పిన విధంగానే తదుపరి స్టేషన్ గయా జంక్షన్ వద్ద సిబ్బందికి డైపర్లు అందించారు. దీంతో ఆ ప్రయాణికుడు చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ అనుభవాన్ని తను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. పదినిమిషాల్లోనే రైల్ మదాద్ , పాంట్రీ కార్ మేనేజర్ ఫోన్ చేశారు, తర్వాత స్టాప్ వద్ద డైపర్లు ఏర్పాటు చేశారు. డిజిల్ ఫిర్యాదుల పరిష్కారం నుంచి ఇంత వేగంగా స్పందన రావడం , ప్రయాణికులకు సేవలం అందించడం చాలా గొప్పవిషయం. ఇది నాకు చాలా మంచి అనుభవం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
దీనిపై నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు భారతీయ రైల్వే నిజంగా మారింది, డిజిటల్ సేవలు అద్భుతంగా ఉన్నాయి అని ప్రశంసిస్తే మరికొంత మంది మాత్రం మందే జాగ్రత్త పడాలి కదా, అంత కష్టం ఎందుకు. పిల్లాడితో ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి దేబీ ప్రసాద్ సమాధానం ఇస్తూ.. నా దగ్గర అప్పటికే డైపర్లు ఉన్నాయి, కానీ ప్రయాణంలో అవి అనుకోకుండా అయిపోయాయి. నేను రైల్‌మడాడ్‌కు ఫిర్యాదు చేసి, డైపర్లకు నా సొంత డబ్బుతోనే చెల్లించాను. నేను ఉచితంగా డైపర్లను తీసుకోలేదు, నాకు నిజంగా సహాయం అయినప్పుడు నేను సేవలను ఉపయోగించుకున్నాను అంటూ తెలిపాడు.
