AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాకు ముల్కనూర్ బియ్యం.. ఎగుమతులకు కేంద్ర గ్రీన్ సిగ్నల్

దేశీయ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న ముల్కనూర్ బియ్యం ఇకపై విదేశాలకు ఎగుమతి కానున్నాయి.. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుల డిమాండ్ మేరకు ముల్కనూర్ బియ్యాన్ని అమెరికాకు పంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.. బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 09, 2026 | 9:56 AM

Share
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు బ్రాండ్ కు చెందిన జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకం బియ్యానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు లభిస్తోంది. అమెరికా లోని తెలుగు వారి నుంచి ఈ బ్రాండ్ బియ్యం కోసం డిమాండ్ పెరిగింది.. ఈ నేపథ్యంలో ముల్కనూర్ సహకార సొసైటీ ఎగుమతి చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

1 / 5
15 సంవత్సరాల నుంచి ముల్కనూర్ సొసైటీ తమ బియ్యాన్ని బ్రాండింగ్ చేసి అమ్మకాలు ప్రారంభించింది. క్రమేపీ సొసైటీకి చెందిన బీపీటీ, జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల ద్వారా ప్రతి ఏటా రూ.25 కోట్ల విలు వైన “ముల్కనూర్ బియ్యాన్ని" విక్రయిస్తోంది. అమెరికాలోని తెలుగువారి నుండి ఫుల్ డిమాండ్..ముల్కనూర్ బ్రాండ్ బియ్యం రుచి చూసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వారు అమెరికాలో ఉన్న తమ బంధువులకు సమాచారం అందించారు. దీంతో అమెరికాలో ఉన్న తెలుగువారు ఈ బ్రాండ్ పై మక్కువ చూపించారు.

2 / 5
అమెరికాకు ఈ బియ్యాన్ని ఎగుమతి చేయాలంటూ గత సంవత్సర కాలంగా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో.. సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఈ మేరకు కసరత్తు ప్రారంభిం చారు. బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో..అమెరికాలోని హార్వెస్ట్ లింక్ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని ముల్కనూర్ బియ్యాన్ని విశాఖ పోర్టు ద్వారా అమెరికాకు పంపించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.

3 / 5
నాణ్యతపరంగా క్రిమిసంహారక మందులు వాడని తెలంగాణ సోనా రకం, జై శ్రీరామ్ రకాలను ఎగుమతి చేయనున్నారు. స్థానికంగా జైశ్రీరామ్ రకం కిలో రూ.80, తెలంగాణ సోనా కిలో రూ.70 చొప్పున విక్రయిస్తుండగా... అమెరికాలో.. మన కరెన్సీ ప్రకారం కిలోకు రూ.200 వరకు ధర పలికే అవకాశం ఉంది. దీంతో ముల్క నూర్ సొసైటీ బియ్యం ఎగుమతికి మొగ్గు చూపింది.

4 / 5
మొదటి విడతలో 25 టన్నుల బియ్యాన్ని అమెరికాకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నౌకల ద్వారా ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కంటైనర్ కు అనుమతి రాగానే 2 నెలల్లో ముల్కనూర్ బ్రాండ్ బియ్యం ఎగుమతి అవుతాయి. ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముల్కనూర్ సహకార సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

5 / 5
Follow Us