AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న బిజినెస్‌.. నెలకు రూ.60 వేల ఆదాయం.. అసలు లెక్క ఇదే!

చిన్న వ్యాపారంతోనూ మంచి ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగించే టెంపర్డ్ గ్లాస్‌ను తయారు చేస్తూ నెలకు రూ.50 నుంచి రూ.60 వేల వరకు లాభం పొందుతున్న యువకుడి వివరాలను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్‌ చేసారు. తన ఇంట్లో పనిచేసే వంట మనిషి కొడుకు ఈ వ్యాపారం చేస్తున్నాడని, అతడి సంపాదన తెలుసుకుని ఆశ్చర్యపోయాననీ తెలిపారు. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

చిన్న బిజినెస్‌.. నెలకు రూ.60 వేల ఆదాయం.. అసలు లెక్క ఇదే!
Man Earns Sixty Thousand Rupees A Month From Simple Tempered Glass Business,
Sharada V
|

Updated on: Oct 09, 2026 | 10:34 AM

Share

తన ఇంట్లో పనిచేసే వంట మనిషిని కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి ఓ వ్యక్తి సరదాగా అడిగారు. తన సంపాదనతో పాటు తన కొడుకు కూడా వ్యాపారం చేస్తున్నాడని చెప్పాడట. దీంతో ఆ యువకుడు ఏదైనా మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడేమోనని భావించారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. యువకుడు మొబైల్ ఫోన్లకు ఉపయోగించే టెంపర్డ్ గ్లాస్‌లను తయారు చేస్తున్నాడు. ఇందుకోసం రూ.70 వేల విలువైన గ్లాస్ కటింగ్ మెషీన్‌ను కొనుగోలు చేసాడు.

30 సెకన్లలోనే టెంపర్డ్ గ్లాస్ రెడీ!

ఈ వ్యాపారంలో తయారీ విధానం కూడా చాలా సులభం అనీ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. యువకుడు తన ఫోన్‌ను మెషీన్‌కు కనెక్ట్ చేసి, ఏ మొబైల్ మోడల్‌కు సంబంధించిన గ్లాస్ కావాలో ఎంపిక చేస్తాడు. ఆ తర్వాత మెషీన్ సాయంతో 30 సెకన్లలో టెంపర్డ్ గ్లాస్‌ను సిద్ధం చేస్తాడు. తయారు చేసిన గ్లాసెస్‌ను సమీపంలోని మొబైల్ షాపులకు సరఫరా చేస్తున్నాడట. అంటే సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకోవడం కంటే, ఇతర దుకాణాలకు ఉత్పత్తులను అందిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్కో గ్లాస్‌పై ఎంత లాభం వస్తుందో చూసినట్లయితే..  ఒక్క గ్లాస్‌కుత యారీ ఖర్చు రూ.8–10, విక్రయ ధర ఒక్క గ్లాస్‌కు రూ.25–30, నెలవారీ లాభం రూ.50,000–60,000.

టెంపర్డ్ గ్లాస్ వ్యాపారంలొ కొత్త నిబంధనలు

ఒకవైపు ఈ చిన్న వ్యాపార విధానం నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, మరోవైపు మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు చర్చకు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (MeitY) సెప్టెంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ ప్రొటెక్టర్లను నాణ్యతా ప్రమాణాల పరిధిలోకి తీసుకొచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) రిజిస్ట్రేషన్ వ్యవస్థ కింద వీటిని చేర్చడం ద్వారా నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయాలను నియంత్రించింది.  నిబంధనల ప్రకారం, భారత్‌లో విక్రయించే సంబంధిత స్క్రీన్ ప్రొటెక్టర్ల తయారీదారులు, దిగుమతిదారులు IS 19348:2025 ప్రమాణానికి అనుగుణంగా తమ ఉత్పత్తులను పరీక్షకు పంపి, అవసరమైన ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. గాజు బలం, మందం, గీతలను తట్టుకునే సామర్థ్యం, అంటుకునే పదార్థాలు, ప్రత్యేక పూత వంటి అంశాలకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి.

‘చిన్న బిజినెస్ మంచి ఆదాయం’

ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో 3.31 లక్షలకు పైగా వ్యూస్, 500 లైక్స్ వచ్చాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇతరుల వ్యాపారం ఎంత పెద్దదో తెలుసుకునే వరకు మనకు వారి సామర్థ్యం అర్థం కాదని వ్యాఖ్యానించారు. తక్కువ పెట్టుబడి, వేగంగా ఉత్పత్తి, ప్రతి వస్తువుపై కొంత మార్జిన్, మొబైల్ షాపుల నుంచి పదేపదే ఆర్డర్లు రావడం వంటి అంశాలు చిన్న వ్యాపారాలను విజయవంతం చేయగలవని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఇతర చిన్న వ్యాపార అవకాశాల గురించి చర్చించారు.

చిన్న ఆలోచన.. పెద్ద అవకాశమా?

టెంపర్డ్ గ్లాస్ వ్యాపారానికి సంబంధించిన ఈ కథ ఇప్పుడు చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారిని ఆకర్షిస్తోంది. భారీ షోరూమ్ లేదా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు లేకుండానే, స్థానిక మొబైల్ షాపులకు ఉత్పత్తులు సరఫరా చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ఈ వ్యాపారం అందిస్తోంది. సరైన ప్రణాళికతో చిన్న వ్యాపారాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని సోషల్ మీడియాలో చర్చకు ఈ యువకుడి కథ దారి తీసింది.

Follow Us