Pan Card: మీకు పాన్ కార్డు లేదా..? ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లోనే పొందవచ్చు.. ఇలా చేస్తే చాలు..
మీకు కొత్త పాన్ కార్డు కావాలా..? అయితే నిమిషాల్లోనే పొందవచ్చు. మీ ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందే మార్గం అందుబాటులో ఉంది. జస్ట్ మీ ఆధార్ కార్డు, మొబైల్ ఉంటే సరిపోతుంది. ఈ ప్రక్రియ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

పాన్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఇది లేనేది దేశంలో ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించలేం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వరకు ప్రతీచోట ఉపయోగపడుతుంది. పెద్ద మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించాలన్నా, అధిక విలువ చేసే స్థలం కొనాలన్నా పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఇక కొత్తగా ఉద్యోగంలో చేరిన తర్వాత శాలరీ పొందాలన్నా ఈ కార్డు తప్పనిసరి. దీంతో పాన్ కార్డు లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోపతే.. మీరు 10 నిమిషాల్లోనే సులువుగా పొందవచ్చు.
ఇన్‌స్టంట్ పాన్ కార్డు పొందటమెలా..?
-పాన్ కార్డు https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan వెబ్‌సైట్ తెరవండి
-కింద గెట్ న్యూ ఈ-పాన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
-మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
-డిజిలాకర్ ద్వారా మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ఆధార్ ధృవీకరణ పూర్తి చేయండి
-ఆధార్ వివరాలు ఆటోమేటిక్‌గా డేటాబేస్ నుంచి అందుతాయి
-ఆ వివరాలు ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి
-మీకు వెంటనే ఈ-పాన్ కార్డు జనరేట్ అవుతుంది
-ఎస్‌ఎంఎస్, ఈమెయిల్‌కు పాన్ కార్డు వివరాలు అందుతాయి
-మీరు ఆ లింకును ఫాలో అవ్వడం ద్వారా ఈ-పాన్ వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?
మీరు ఈ-పాన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని స్టేటస్ ఈజీగా తెలుసుకోవచ్చు
-https://www.incometax.gov.in/iec/foportal/ పోర్టల్‌కి వెళ్లాలి
-కింద క్విక్ లింక్స్‌లో ఇన్‌స్టంట్ ఈ-పాన్ ఆప్షన్ ఎంచుకోవాలి
-అనంతరం ఈ -పాన్ స్టేటస్/ఈ-పాన్ డౌన్ లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
-ఆధార్ నెంటర్ నమోదు చేసి ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
-అనంతరం స్క్రీన్‌పై మీ పాన్ కార్డ్ స్టేటస్ కనిపిస్తుంది
-పాన్ కార్డు జారీ అయితే వ్యూ పాన్‌పై క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు
-డౌన్ లోడ్ ఈ-పాన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ నెంబర్, మొబైల్ ఉంటే చాలు..
ఈ-పాన్ పొందేందుకు కేవలం ఆధార్ నెంబర్, మొబైల్ ఉంటే సరిపోతుంది. మీ వివరాలు ధృవీకరించడానికి ఆధార్ సహయపడుతుంది. ఇక ఓటీపీ నమోదు చేసేందుకు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంటర్ అవసరం. ఈ రెండు ఉంటే మీరు 10 నిమిషాల్లోనే ఈ-పాన్ కార్డు పొందవచ్చు. ఈ కార్డును మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. దీంతో పాన్ కార్డు కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పని లేదు.
