Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఎప్పటి నుంచో భారతీయుల కల. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది మోదీ సర్కార్. తాజాగా దీని గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. 2017లో దేశంలో ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ఆ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి కీలక విషయం వెల్లడించారు కేంద్రమంత్రి దర్శన జార్దోష్. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సూరత్ బుల్లెట్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన గ్రాఫికల్ డిజైన్ ఫోటోలను షేర్ చేశారు రైల్వే, జౌళిశాఖల మంత్రి దర్శన జార్దోష్. సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ గ్రాఫికల్ డిజైన్ చిత్రాలను మీ అందరితో పంచుకుంటున్నానని చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ స్టేషన్ లోపల ప్రదేశం మెరిసే వజ్రాన్ని, సూరత్ నగరాన్ని పోలి ఉంటుందని చెప్పారు.
సూరత్ బుల్లెట్ రైలు స్టేషన్ బయట, లోపలివి రెండు గ్రాఫికల్ చిత్రాలతో సహా, స్టేషన్ నిర్మిస్తున్న ఫోటోలను షేర్ చేశారు. 2017లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. వచ్చేఏడాది డిసెంబరు నాటికి తొలి ప్రయాణం చేయాలన్నది లక్ష్యం. కానీ, మహారాష్ట్రలో భూ సేకరణలో జాప్యం, కరోనా వల్ల దీన్ని 2028 వరకు పొడిగించారు. ఫిబ్రవరి 9 నాటికి గుజరాత్ రాష్ట్రంలో 98.63 శాతం, దాద్రా నగర్ హవేలీలో 100 శాతం, మహారాష్ట్రలో 60.2 శాతం భూసేకరణ జరిగింది. 508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్, దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు. 348 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలో, 4 కిలోమీటర్లు దాద్రా నగర్ హావేలీలో, మిగిలిన 156 కిలోమీటర్ల మహారాష్ట్రలో ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం లక్ష కోట్ల పైమాటే. ఇందులో 81 శాతం జపాన్ నుంచి రుణంగా అందనుంది.
Sharing with you all, 1st glimpse of graphical representation of Surat’s Bullet Train station.
The state-of-the-art multi-level station will have external facade and interiors of the station resemble a sparkling diamond – the pride of Surat city. #NayeBharatKiNayiRail #Surat pic.twitter.com/YQppvzEF8Z
— Darshana Jardosh (@DarshanaJardosh) February 10, 2022
ఇవి కూడా చదవండి: