Indian Railways: సరికొత్త ఆలోచన.. రైళ్లే స్కూలు.. త్వరలో అమలుకు సన్నాహాలు.. రైల్వే శాఖ ఆదేశాలు రావడమే ఆలస్యం..!

|

Feb 21, 2021 | 8:16 PM

Indian Railways: దేశంలో కరోనా మహమ్మారి సమయంలో రైలు బోగీలను హోం క్వారంటైన్‌ గదులుగా మార్చిన విషయం తెలిసిందే. మరో వైపు పలు ప్రాంతాల్లో స్కూలు భనవాలు లేని ...

Indian Railways: సరికొత్త ఆలోచన.. రైళ్లే స్కూలు.. త్వరలో అమలుకు సన్నాహాలు.. రైల్వే శాఖ ఆదేశాలు రావడమే ఆలస్యం..!
Follow us on

Indian Railways: దేశంలో కరోనా మహమ్మారి సమయంలో రైలు బోగీలను హోం క్వారంటైన్‌ గదులుగా మార్చిన విషయం తెలిసిందే. మరో వైపు పలు ప్రాంతాల్లో స్కూలు భనవాలు లేని విద్యార్థులు చెట్ల కింద, పశుశుల పాకల్లోనూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే తాజాగా సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. వాడుకలో లేని రైలు బోగీలను పాఠశాల తరగతి గదులుగా మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖను కోరింది. అయితే ఇలా అడగడానికి బలమైన కారణం లేకపోలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో రైల్వే స్టేషన్‌ల చుట్టుపక్కల చాలా రైళ్లు ఖాళీగానే ఉన్నాయి. సర్వీసులు లేక అవి అలాగే పాడైపోతాయోమో అనిపించేలా ఉన్నాయి. కొన్ని రైలు బోగీలైతే ప్రయాణించేందుకు కూడా పనికి రావని రైల్వే అధికారులు పక్కనపెట్టేశారు. అట్లాంటివి తమకు ఇస్తే స్కూలు తరగతులుగా మార్చుకుంటామని సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (SDMC) చెబుతోంది.

అయితే ఇలాంటి ఆలోచన మంచిదే. ఎట్లాగో ఆ బోగీలను పక్కనపెట్టేశారు.. అవి వాడేందుకు కూడా పనికి రావు. అవి అలాగే మూలాన పడే బదులు మాకు ఇస్తే.. స్కూళ్లుగా, చెత్తను పారేసేందుకు, టాయిలెట్‌ సదుపాయాలు కల్పించేందుకు వాడుకుంటాం అని మేయర్‌ రైల్వే శాఖకు తెలిపారు. ఈ నేపథ్యంలో సౌత్‌ ఢిల్లీ మేయర్‌ అనామికా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌తో వర్చువల్‌ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. వాడకుండా ఉన్న బోగీలు తమకు ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు రైల్వే మంత్రి గోయల్‌ అంగీకరించారని మేయర్‌ అనామిక తెలిపారు.

ఇలా వాడకుండ ఉన్న బోగీలు ఇస్తే.. చాలా కాలనీల్లో వాటి దవారా హెల్త్‌ కేర్‌ సదుపాయాలు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుందని ఆమె అన్నారు. చాలా కాలనీలకు ఆస్పత్రి, విద్యా సదుపాయాలు లేవని తెలిపారు. ఇలాంటి బోగీలు స్కూళ్లుగా మారిస్తే పిల్లలు కూడా ఆసక్తితో వస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.

రైలు బోగీలు చిన్నపాటి బడ్జెట్‌తో తగిన మార్పులు చేసి కార్పొరేషన్‌ సిబ్బందిని కూడా సేవలందించేందుకు కేటాయిస్తామని మేయర్‌ అన్నారు. మరి ఈ ఆలోచన మంచిదే అయినా.. రైల్వే శాఖ ఎలా స్పందిస్తుందో త్వరలో తేలనుంది.