Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. కార్మికుల కోసం అదనపు రైళ్లు.. ఏయే ప్రాంతాల్లో నడవనున్నాయంటే..?

|

Apr 26, 2021 | 11:26 AM

April-May Additional Trains: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మళ్లీ దేశంలో లాక్‌డౌన్ ఉంటుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. కార్మికుల కోసం అదనపు రైళ్లు.. ఏయే ప్రాంతాల్లో నడవనున్నాయంటే..?
Indian Railways
Follow us on

April-May Additional Trains: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మళ్లీ దేశంలో లాక్‌డౌన్ ఉంటుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల నుంచి బతుకుతెరువు కోసం వేరే రాష్ట్రాలకు వచ్చిన కార్మికులు మళ్లీ స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా రద్దీ ఉన్న ప్రాంతాలకు ఏప్రిల్‌, మే మధ్య అదనపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలో రద్దిగా ఉన్న ప్రాంతాలకు అదనపు రైళ్తు నడుస్తాయని వెల్లడించింది. దీనిలో భాగంగా గోరఖ్‌పూర్‌, పాట్నా, ముజఫర్‌పూర్‌, వారణాసి, గౌహతి, ప్రయాగ్‌రాజ్‌, లక్నో, బరౌని, కోల్‌కతా, దర్భంగా, భాగల్‌పూర్‌, మాండూవాడి, రాంచీ తదితర ప్రాంతాలకు 330 అదనపు రైళ్లు, 674 ట్రిప్పులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే బోర్డ్‌ చైర్మన్‌ సునీత్‌ శర్మ తెలిపారు. ఇందులో 101 ముంబై నుంచి, 21 రైళ్లు ఢిల్లీ ప్రాంతం నుంచి నడుస్తాయని పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నా.. అదనంగా రద్దీ లేకున్నా.. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరిగి పయనమవుతున్నారని.. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రైల్వేశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 70శాతం రైల్వే సేవలు కొనసాగుతున్నాయని, డిమాండ్‌ ఉన్న చోట అదనపు రైల్వే నడుపుతున్నట్లు బోర్డు చైర్మన్‌ సునీత్‌ శర్మ తెలిపారు. ప్రతి రోజు సగటున 1,514 ప్రత్యేక రైళ్లు.. 5,387 సబర్బన్‌ రైళ్లు నడుస్తున్నాయని వివరించారు. అదనంగా రద్దీతో కూడిన ప్రాంతాల్లో 28 ప్రత్యేక రైళ్లకు క్లోన్‌ రైళ్లు, 984 ప్యాసింజర్‌ రైలు సర్వీసులు నడుస్తున్నాయని వెల్లడించారు. కొవిడ్‌ కేసుల పెరుగుదల మధ్య సర్వీసులు నిరంతరం నడుస్తున్నాయని, డిమాండ్‌ ఉన్న చోట సర్వీసులు పెంచుతున్నామని చెప్పారు. కాగా.. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కార్మికులు సొంత రాష్ట్రాలకు పయనమవుతుండటంతో ఆయా ప్రాంతాల్లో మళ్లీ కరోనా విస్తరించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కార్మికులు ఆ రాష్ట్రాలకు చేరిన వెంటనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read:

Oxygen Concentrators: భారత్‌కు అమెజాన్ సాయం.. సింగపూర్ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు..

Harsh Vardhan: అనవసర రాజకీయాలు చేస్తున్నారు.. ఆ వ్యాక్సీన్లన్నీ రాష్ట్రాలకే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్