Indian Railways: నీటిని ఆదాచేయడమే లక్ష్యంగా ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న భారత రైల్వేలు

|

Nov 03, 2021 | 9:08 AM

ఒకవైపు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే మరోవైపు పొదుపుగా వనరులను వినియోగించుకోవడంలో కూడా భారతీయ రైల్వే నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతోంది.

Indian Railways: నీటిని ఆదాచేయడమే లక్ష్యంగా ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న భారత రైల్వేలు
Automatic Coach Washing Plant
Follow us on

Indian Railways: ఒకవైపు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే మరోవైపు పొదుపుగా వనరులను వినియోగించుకోవడంలో కూడా భారతీయ రైల్వే నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడేందుకు భారతీయ రైల్వే అన్ని చర్యలు తీసుకుంటూనే మరోవైపు నీటి ఆదా కోసం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి, భారతీయ రైల్వే నీటి పొదుపు దిశలో పెద్ద ముందడుగు వేసింది. భారతీయ రైల్వే ఇప్పుడు ప్యాసింజర్ కోచ్‌లను శుభ్రం చేయడానికి..కడగడానికి ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయని.. ఇప్పుడు వాటి సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేస్తాము.

అధిక లోడు డిపోల్లో ముందుగా ప్లాంట్ల ఏర్పాటు..

కోచ్‌లను క్లీన్ చేసే ఈ ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌లను ముందుగా లోడ్ ఎక్కువగా ఉన్న కోచ్ డిపోల్లో ఏర్పాటు చేయాలన్నది రైల్వేశాఖ ప్రయత్నం. నీటి ఆదా కోసం ఏర్పాటు చేయబోయే ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ నీటిని ఆదా చేయడమే కాకుండా కోచ్‌లను అద్భుతంగా కడగడం ద్వారా శుభ్రం చేసి మెరిపిస్తుంది. దీనితో పాటు, రైల్వేల విలువైన సమయాన్ని ఆదా చేయడంలో కూడా ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో రైల్వే కార్మికులు మాత్రమే రైల్వే కోచ్‌లను కడగడం, శుభ్రపరచడం చేస్తున్నారు. మాన్యువల్ వాషింగ్ కంటే మెషిన్ వాషింగ్ చాలా మంచిది.

ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌లో నీటి ఆదా 96 శాతం వరకు ఉంటుంది..

భారతీయ రైల్వే గుజరాత్‌లోని గాంధీధామ్ కోచింగ్ డిపోలో ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌లో ఇప్పుడు మొత్తం రైలును కడగడం కొన్ని నిమిషాల్లో పూర్తిచేస్తుంది. అయితే సాధారణంగా రైలును కడగడానికి ఉద్యోగులకు గంటల సమయం పడుతుంది. ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌లోని కోచ్‌లను కడగడం ద్వారా 96 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. దీనివల్ల రైల్వేలు ఏడాదిలో 1.28 కోట్ల కిలోలీటర్ల (12,80,00,00,000 లీటర్లు) నీటిని ఆదా చేయగలవు. భారతీయ రైల్వేల హరిత కార్యక్రమాలు వాతావరణ మార్పుల ప్రభావాలను సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో తగ్గించే వైపుగా.. భారతదేశ లక్ష్యాల దిశగా దోహదపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Sleeping time: నిద్ర అవసరానికంటే ఎక్కువైనా.. తక్కువైనా ఆ వ్యాధి ఖాయం! సరైన నిద్ర కోసం ఇలా చేయండి!

Pakistan: భారత్ పై మరోసారి అక్కసు వెళ్ళకక్కిన పాకిస్తాన్.. ఆఫ్ఘన్ సదస్సులో పాల్గోవడం లేదని ప్రకటన!

Modi in COP26: ఒకే సూర్యుడు..ఒకే ప్రపంచం..ఒకే గ్రిడ్ ఇదే మన నినాదం కావాలి.. సౌరశక్తిపై ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు!