రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ(IRCTC) కీలక ప్రకటన జారీ చేసింది. రైల్వే ప్రయాణం(train journey) అంటేనే రిజర్వేషన్ చార్ట్‌ను(train chart preparation time) సిద్ధం చేసిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో టిక్కెట్‌ను రద్దు చేయడం చాలా సార్లు జరుగుతుంది. ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా కూడా జర్నీ టైమింగ్‌లో మార్పులు జరగుతుంటాయి.. ఇలాంటప్పుడు రైల్వే ప్రయాణానికి కాస్తా ముందు కూడా రైల్వే టికెట్ రద్దు చేసుకోవచ్చు. సాధారణంగా ట్రైన్ బయలు దేరడానికి 4 గంటలు ముందుగానే చార్ట్ ప్రిపేర్ అవుతుంది. మళ్లీ ట్రైన్ బయలు దేరడానికి 30 నిమిషాలు ముందు మరోసారి చార్ట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇలా రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా మనం టికెట్ రద్దు చేసుకోవాడానికి ఛాన్స్ ఉంది.. ఈ సందర్భంలో మీ టిక్కెట్ డబ్బును వాపసు చేయవచ్చు.
IRCTC మీరు టిక్కెట్‌పై వాపసు ఎలా పొందవచ్చనే దాని గురించి సమాచారాన్ని అందించింది. ఇది మీకు జరిగితే మీరు వాపసును క్లెయిమ్ చేయవచ్చు. IRCTC తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. భారతీయ రైల్వే ప్రయాణం చేయని టిక్కెట్లు, పాక్షికంగా ప్రయాణించిన టిక్కెట్లపై వాపసు ఇస్తుందని తెలియజేసింది. అయితే దీని కోసం ప్రయాణికులు రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ డిపాజిట్ రసీదు (IDR)ను సమర్పించాల్సి ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
TDRని ఆన్‌లైన్‌లో ఇలా ఫైల్ చేయండి
ఇవి కూడా చదవండి: Indian Navy Milan 2022: విశాఖ చరిత్రలో ఇది గర్వించదగ్గ రోజు.. మిలాన్-2022లో సీఎం జగన్..