Shocking Video: వాషింగ్‌ మెషీన్‌ వాడొద్దన్నాడనీ.. తల నరికి, కాలితో తన్ని.. చెత్తబుట్టలో పడేశాడు!

టెక్సాస్‌లోని తూర్పు డల్లాస్‌లో బుధవారం (సెప్టెంబర్‌ 10) దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్నాటకకు చెందిన వ్యక్తి డల్లాస్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవ కారణంగా భార్య, కొడుకు చూస్తుండగా.. అతని తల నరికి, కాలితో తన్ని చెత్తకుప్పలో పడేశాడో దుండగుడు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..

Shocking Video: వాషింగ్‌ మెషీన్‌ వాడొద్దన్నాడనీ.. తల నరికి, కాలితో తన్ని.. చెత్తబుట్టలో పడేశాడు!
Karnataka Man Brutally Killed In Dallas

Updated on: Sep 12, 2025 | 10:57 AM

డాల్లాస్‌, సెప్టెంబర్‌ 12: కర్ణాటకకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య (50) అనే వ్యక్తి గత రెండు, మూడేళ్లగా డాలస్‌ ఓ మోటల్‌ (Motel) నిర్వహిస్తున్నారు. అతనితోపాటు భార్య, 18 కుమారుడు కూడా అక్కడే ఉంటున్నారు. యోర్దనిస్‌ కోబాస్‌ మార్టిన్జ్‌ (37) అనే వ్యక్తి అని వద్ద గత కొంత కాలంగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్ 10 ) ఉదయం ఓ గదిని శుభ్రం చేస్తున్న సమయంలో వాషింగ్‌ మెషీన్‌ విరిగిపోయిందని, దానిని వాడొద్దని కోబాస్‌కు చెప్పడంతో వివాదం తలెత్తింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన కోబాస్‌ కత్తి తీసుకుని మోటెల్ ముందు కార్యాలయంలో వెంబడించి పలుమార్లు కత్తితో పొడిచాడు.

నాగమల్లయ్యను కాపాడేందుకు అతడి భార్య, కొడుకు ప్రయత్నించినప్పటికీ కోబాస్‌ వారిని పక్కకు తోసేశాడు. నాగమల్లయ్య మరణించిన తర్వాత అతని తల నరికి, కాలితో వీధిలోకి తన్నాడు. దీంతో తల దొర్లుకుంటూ బయటకు వచ్చిపడింది. ఆపై దానిని చేతుతో పట్టుకుని దగ్గర్లోని చెత్తబుట్టలో పడేశాడు. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ సంఘటన రికార్డయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కోబాస్‌ను అరెస్ట్‌ చేశారు. అతని వద్ద హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిసిన టీషర్టు, నాగమల్లయ్య ఫోన్‌, కీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

నేరస్తుడు కోబాస్‌పై ఇప్పటికే కాలిఫోర్నియా, ఫ్లోరిడా, హూస్టన్‌లో పలు మార్లు అరెస్టులు జరిగినట్లు పోలీస్‌ రికార్డులు వెల్లడించాయి. నాగమల్లయ్య మృతిపట్ల భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైన అన్ని సహాయాలు అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం నిందితుడు డల్లాస్‌ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.