Indian Oil tatkal facility: తత్కాల్ సిలిండర్ సౌకర్యం.. బుక్ చేసిన గంటల్లో సిలిండర్ హోమ్ డెలివరీ

|

Jan 18, 2021 | 7:46 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారుల కోసం కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.  తత్కాల్ సేవల పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

Indian Oil tatkal facility: తత్కాల్ సిలిండర్ సౌకర్యం.. బుక్ చేసిన గంటల్లో సిలిండర్ హోమ్ డెలివరీ
Follow us on

Indian Oil tatkal facility:  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారుల కోసం కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.  తత్కాల్ సేవల పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. తత్కాల్ సర్వీస్ ద్వారా బుక్ చేసిన గంటల్లో సిలిండర్ అందజేస్తామని ప్రకటించింది. ‘శిలా భారత జీవనం’ పేరుతో ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ సేవలను ప్రారంభించింది. సంక్రాంతి తర్వాత అన్ని జిల్లాల్లో ఈ సేవలను విస్తరించనున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ స్కీమ్‌ను కేంద్రం అభినందించింది. దేశవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని కేంద్రం కసరత్తులు ప్రారంభించింది. అయితే తత్కాల్ కింద బుక్ చేసేవారు రూ.25 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆన్ లైన్‌‌లో బుక్ చేస్తే తత్కాల్ బుక్ చేస్తే.. సిలిండర్ డెలివరీ చేస్తారు. ఇందుకోసం కొత్త యాప్ కూడా తీసుకురాబోతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఆన్ లైన్‌‌లో బుక్ చేస్తే అనంతరం  రిసిప్ట్ మాత్రం ఇవ్వరు. నగదుకు సంబంధించి.. ఫోన్‌కు మేసేజ్ పంపిస్తారు.

Also Read: Pan Card: పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా ? ఈ విధంగా చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే మీ చెంతకు..