నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజులు ఆలస్యం.. తెలంగాణలో మాత్రం తేలికపాటి వర్షాలు..

|

May 30, 2021 | 4:34 PM

నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల పాటు ఆలస్యం అవుతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది.

నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజులు ఆలస్యం.. తెలంగాణలో మాత్రం తేలికపాటి వర్షాలు..
Southwest Monsoon
Follow us on

నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌-త‌మిళ‌నాడుకు చాలా దగ్గర‌గా ఉన్నాయని భార‌త వాతావ‌ర‌ణ సంస్థ తెలిపింది. రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం కొమొరిన్ సముద్రంలోని తీరానికి దగ్గరగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో 24 గంటల్లో ఎప్పుడైనా చేరుకోవచ్చున‌ని ముందుగా వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే… తాజాగా కొన్ని సవరణలు చేసింది. చేసిన మార్పుల ప్రకారం జూన్ 3 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ రోజు ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గడ్ మీదుగా విదర్భ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమిటర్ల వరకు ఏర్పడిందని తెలిపింది. అంతే కాకుండా ఉపరితల ఆవర్తనం తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కి.మి. నుంచి 7.6 కి.మి నుంచి వరకు వ్యాపించి ఉంది అని తెలిపింది.

రాగల మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

గత చాలా రోజులుగా దక్షిణ-పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వర్షం, గాలి, రేడియేషన్ యొక్క అనేక పారామితులను కలుపుకున్న తర్వాత రుతుపవనాలు కేరళకు చేరుకున్నట్లు నిర్ధారించారు.