భారత్-బంగ్లా మధ్య మరో వివాదం.. ముదురుతున్న బార్డర్ లొల్లి..!

|

Jan 14, 2025 | 8:24 AM

సరిహద్దు వివాదం మరింత రాజుకుంటోంది. సరిహద్దు వద్ద ఫెన్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బంగ్లాదేశ్ భారత రాయబారి ప్రణయ్ వర్మను పిలిపించిన ఒక రోజు తర్వాత, బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ ఎండీ నురల్ ఇస్లామ్‌ను విదేశాంగ కార్యాలయానికి భారత్ సోమవారం పిలిపించింది.

భారత్-బంగ్లా మధ్య మరో వివాదం.. ముదురుతున్న బార్డర్ లొల్లి..!
Bharat Bangladesh
Follow us on

భారత్ హైకమిషన‎ర్‎కు బంగ్లాదేశ్‌ నోటీసులు ఇవ్వగా.. 24 గంటలు గడవకముందే భారత్.. బంగ్లాదేశ్ ప్రతినిధికి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి చొరబాటు యత్నాలు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ భద్రతను పటిష్ఠం చేసింది. ఈ క్రమంలోనే కంచె నిర్మాణానికి చర్యలు తీసుకోగా.. బంగ్లాదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల మధ్యే సరిహద్దు ఉద్రిక్తతల పేరుతో భారత హైకమిషనర్‌ ప్రణయ్‌ వర్మను బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ పిలిపించింది.

ఈ వ్యవహారంపై భారత్‌ సైతం చర్యలు చేపట్టింది. ఇక్కడి బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నురల్‌ ఇస్లామ్‌కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చారు. ఇండో- బంగ్లా సరిహద్దులో ఐదు చోట్ల కంచెల ఏర్పాటుకు భారత్‌ ప్రయత్నిస్తోందని, ఇది ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లా ఆరోపణలు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే భారత హైకమిషనర్‌ ప్రణయ్‌ వర్మకు సమన్లు జారీ చేసింది.

ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లిన ప్రణయ్‌వర్మ.. అక్కడున్న కార్యదర్శి జషీముద్దీన్‌తో సమావేశమయ్యారు. కంచెల విషయంలో రెండు దేశాల భద్రతా బలగాలు బీఎస్‌ఎఫ్, బార్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌లు ఓ అవగాహనతో ఉన్నాయన్నారు వర్మ. రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం మేరకు సరిహద్దు వెంబడి నేరాలను ఎదుర్కోవడానికి పరస్పర సహకారం ఉంటుందని ఆశిస్తున్నాన్నారు. సరిహద్దు వివాదంపై భారత హైకమిషనర్‎కు బంగ్లా నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే బంగ్లాకు హైకమిషనర్‎కు భారత్ సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్‎గా మారింది.

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సరిహద్దులో ఇండియా వ్యవహరిస్తోన్న తీరుతో భారత్‎పై బంగ్లాదేశ్ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో భారత్ హైకమిషన‎ర్‎కు బంగ్లా నోటీసులు ఇవ్వగా.. 24 గంటలు గడవకముందే భారత్.. బంగ్లాదేశ్ ప్రతినిధికి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..