AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులపై క్యూఆర్ (QR) కోడ్ తప్పనిసరి!

భారతదేశ ఫార్మాస్యూటికల్ సరఫరా, నాణ్యత, భద్రత, సమగ్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం గురువారం (జూన్ 25, 2026) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నకిలీ, నాసిరకం మందుల చలామణీకి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 'డ్రగ్స్ రూల్స్, 1945'కు కీలక సవరణలను నోటిఫై చేసింది. ఈ సరికొత్త సవరణల ద్వారా ‘షెడ్యూల్ H2’ పరిధిని విస్తరించడంతో పాటు, అత్యంత కీలకమైన అదనపు కేటగిరీల మందులను కూడా క్యూఆర్ కోడ్ ఆధారిత ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకువచ్చింది.

కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం.. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులపై క్యూఆర్ (QR) కోడ్ తప్పనిసరి!
Qr Codes On Mandates
Balaraju Goud
|

Updated on: Jun 25, 2026 | 7:47 PM

Share

భారతదేశ ఫార్మాస్యూటికల్ సరఫరా, నాణ్యత, భద్రత, సమగ్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం గురువారం (జూన్ 25, 2026) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నకిలీ, నాసిరకం మందుల చలామణీకి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘డ్రగ్స్ రూల్స్, 1945’కు కీలక సవరణలను నోటిఫై చేసింది. ఈ సరికొత్త సవరణల ద్వారా ‘షెడ్యూల్ H2’ పరిధిని విస్తరించడంతో పాటు, అత్యంత కీలకమైన అదనపు కేటగిరీల మందులను కూడా క్యూఆర్ కోడ్ ఆధారిత ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకువచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం-1985 పరిధిలోకి వచ్చే అన్ని రకాల వ్యాక్సిన్‌లు, యాంటీమైక్రోబియల్స్ (యాంటీబయాటిక్స్), నార్కోటిక్, సైకోట్రోపిక్ డ్రగ్స్, అలాగే అన్ని రకాల క్యాన్సర్ నిరోధక ఔషధాలను ‘షెడ్యూల్ H2’ కింద చేర్చారు. సవరణ ఫలితంగా, సదరు ఔషధాల తయారీదారులు తాము ఉత్పత్తి చేసే మందుల ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌పై (ఉదాహరణకు బాటిల్ లేదా స్ట్రిప్), ఒకవేళ అక్కడ తగినంత స్థలం లేకపోతే ద్వితీయ ప్యాకేజింగ్ లేబుల్‌పై తప్పనిసరిగా బార్ కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్‌ను ముద్రించాల్సి ఉంటుంది.

ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?

ఈ విధానం ద్వారా ఔషధాల తయారీ నుండి రోగికి చేరే వరకు ప్రతి దశను డిజిటల్‌గా పర్యవేక్షించవచ్చు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల ద్వారా స్కాన్ చేసినప్పుడు ఈ క్యూఆర్ కోడ్‌లో క్రింది కీలక సమాచారం లభిస్తుంది.

* ప్రత్యేక ఉత్పత్తి గుర్తింపు కోడ్ (Unique Product ID)

* ఔషధం జెనరిక్, బ్రాండ్ పేర్లు

* తయారీదారు పేరు, పూర్తి చిరునామా

* బ్యాచ్ నంబర్, తయారీ (Mfg),గడువు (Expiry) తేదీలు

* తయారీ లైసెన్స్ నంబర్, వాడిన సహాయక పదార్థాల వరాలు.

నకిలీల నివారణ – ‘సూపర్ బగ్స్’ పై పోరాటం

గతంలో ఈ క్యూఆర్ కోడ్ నిబంధన కేవలం దేశంలోని అగ్రశ్రేణి 300 ఫార్మాస్యూటికల్ బ్రాండ్లకు మాత్రమే వర్తించేది. కానీ ప్రస్తుత సవరణతో దీని పరిధి విపరీతంగా పెరిగింది. మార్కెట్లో నకిలీ క్యాన్సర్ మందులు, నాణ్యత లేని వ్యాక్సిన్ల పంపిణీని అరికట్టడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ముఖ్యంగా, నాసిరకం యాంటీమైక్రోబయల్ ఉత్పత్తులను గుర్తించడం ద్వారా, వైద్య రంగానికి పెద్ద సవాలుగా మారిన యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR – మందులకు లొంగని సూపర్ బగ్స్ ఏర్పడటం)కు వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయ పోరాటానికి ఈ నిర్ణయం పెద్ద ఊతాన్ని ఇస్తుంది.

ఫార్మా పరిశ్రమలు, భాగస్వామ్య పక్షాలు ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా మారేందుకు ప్రభుత్వం తగినంత సమయాన్ని ఇస్తూ దశలవారీ కాలపరిమితిని విధించింది. వ్యాక్సిన్‌లు, నార్కోటిక్, సైకోట్రోపిక్, క్యాన్సర్ నిరోధక మందుల నిబంధనలు 1 జూలై ,2027 నుండి అమల్లోకి వస్తాయి. యాంటీమైక్రోబియల్స్‌కి సంబంధించిన నిబంధనలు 1 జూలై 2028 నుండి అమలులోకి వస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us