Watch: ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి మరో వీడియో విడుదల చేసిన భారత సైన్యం

ఆపరేషన్‌ సింధూర్‌లో పాకిస్తాన్‌కు ఇంతవరకూ చూపించింది ట్రైలరే. ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందుముందు చూపిస్తామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని.. సీజ్‌ఫైర్ ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

Watch: ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి మరో వీడియో విడుదల చేసిన భారత సైన్యం
Operation Sindoor Video

Updated on: May 18, 2025 | 11:20 AM

ఆపరేషన్‌ సింధూర్‌లో పాకిస్తాన్‌కు ఇంతవరకూ చూపించింది ట్రైలరే. ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందుముందు చూపిస్తామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని.. సీజ్‌ఫైర్ ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

పహల్గామ్ నరమేధం తర్వాత, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకే భారత సైన్యం ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టింది. ఉగ్ర స్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌లో.. 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో వంద మంది ఉగ్రవాదులు అంతమయ్యారని భారత సైన్యం ప్రకటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 5 , పాక్‌లో 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం అయ్యాయి. భారత్‌ దాడులు చేస్తుందన్న భయంతో పాక్‌లోని ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయి.

తాజాగా భారత సైన్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన మరొక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో, ఆర్మీ సైనికులు ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత సైన్యం ఈ వీడియోను షేర్ చేసి ఇలా రాసింది – ‘ప్రణాళిక రూపొందించి, శిక్షణ ఇచ్చి, చర్య తీసుకున్నాం.. న్యాయం జరిగింది.” ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ దశాబ్దాలుగా నేర్చుకుని ఒక గుణపాఠం అని భారత సైన్యం పేర్కొంది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..