
ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. గుజరాత్‌లో రెండురోజుల పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ వడోదరలో రోడ్‌షోతో పర్యటనను ప్రారంభించారు. త్రివర్ణపతాకాలతో ప్రధానికి వడోదర ప్రజలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి నారీశక్తి స్వాగతం పలికింది.. మోదీకి 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా.. గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని మోదీ పాల్గొన్న సింధూర్ సమ్మాన్‌యాత్రలో కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సోఫియా ఖురేషీ- వడోదర చెందినవారు. ఆమె కుటుంబీకులు అక్కడే స్థిరపడ్డారు. ప్రధాని మోదీ వడోదరలోనే రోడ్‌షో చేయడంతో, ఖురేషీ కుటుంబసభ్యులు- రోడ్‌షోలో స్పెషల్‌గా కనిపించారు. మోదీపై కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు పూలవర్షం కురిపించారు..
ప్రధాని మోదీకి పూలు చల్లుతూ ఖురేషి కుటుంబసభ్యులు స్వాగతం పలకగా.. ప్రధాని మోదీ వారికి అభివాదం చేశారు.
Gujarat: Family members of Indian Army officer Colonel Sofiya Qureshi joined Prime Minister Narendra Modi’s roadshow in Vadodara, Gujarat pic.twitter.com/b9et75Ns1r
— ANI (@ANI) May 26, 2025
కాగా.. పహల్గామ్ ఉగ్రదాడిని కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబీకులు ఖండించారు. మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ తమకు చాలా గర్వంగా ఉందని సోఫియా సోదరి షాయనా చెప్పారు. భారత్‌వైపు ఎవరైనా చూడాలంటే ఇక భయపడతారని షాయనా చెప్పారు.. మహిళల సింధూరం కోసం తన కూతురు యుద్ధం చేయడం తనకు గర్వంగా ఉందని సోఫియా తల్లి చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..