AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCO Summit in India: ఇవాళ ఒకే వేదికపైకి చైనా, పాక్, భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎస్‌సీఓ సమావేశం

రష్యాలోని వాగ్నర్ గ్రూప్ గత నెలలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేసిన సమయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ ప్రైవేట్ సైన్యం మాస్కో వైపు వెళ్లడం ప్రారంభించింది. అతని తిరుగుబాటు ఎక్కువ కాలం కొనసాగలేదు.

SCO Summit in India: ఇవాళ ఒకే వేదికపైకి చైనా, పాక్, భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎస్‌సీఓ సమావేశం
Sco Summit
Sanjay Kasula
|

Updated on: Jul 04, 2023 | 9:54 AM

Share

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి భారత్  ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న ఎస్‌సీఓ సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరుకానున్నారు. రష్యాలోని వాగ్నర్ గ్రూప్ గత నెలలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేసిన సమయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ ప్రైవేట్ సైన్యం మాస్కో వైపు వెళ్లడం ప్రారంభించింది. అతని తిరుగుబాటు ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రతిదీ శాంతియుతంగా పరిష్కరించబడింది. ప్రాంతీయ భద్రత , వ్యాపారం, పరస్పర సంబంధాలను పెంచుకునే చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.  యురేషియన్ గ్రూపింగ్‌లో కొత్త శాశ్వత సభ్యునిగా ఇరాన్ చేరింది. ఈ సమావేశాల్లో ఈ దేశం పాల్గొనడం ఇదే తొలిసారి.

వాగ్నర్ తిరుగుబాటు తర్వాత పుతిన్  కనిపించడం ఇదే మొదటిసారి. జూన్ 24న  వాగ్నెర్ గ్రూప్ ఊహించని తిరుగుబాటుకు తెరలేపాడు. ఈ ఘటన తర్వాత మొదటిసారిగా అధ్యక్షుడు పుతిన్ బహుపాక్షిక ఫోరమ్‌లో పాల్గొంటారు. సురక్షితమైన SCO అనే  అంశంపై ఈ సారి సమావేశం జరుగుతుంది. వాస్తవంగా ఈ శిఖరాగ్ర సమావేశం ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారు.

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదాలు, ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులపై చర్చలు, గ్రూప్ గ్రూపులోని సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంచుకోవడం వంటి అనేక అంశాలపై ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమ్మిట్ గురించి తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. చెయ్యవచ్చు ఈ భేటీలో తమ మధ్య వ్యాపారాన్ని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చైనాతో ఉద్రిక్తత మధ్య భేటీ

ఒకే వేదికపై చైనా- భారత్ రావడం చాలా కాలం తర్వాత జరుగుతోంది. తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా సైనికుల జరిగిన ఘటన తర్వాత  కలవడం ఇదే మొదటిసారి. నెత్తుటి ఘర్షణ కొద్దిరోజుల క్రితం పూర్తయిన తరుణంలో ప్రధాని మోదీ తన తొలి విదేశీ  పర్యటనకు అమెరికా వచ్చిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం