India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కోవిడ్ థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య దాదాపు వేయిగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 975 కరోనా కేసులు (Covid-19) నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి నిన్న నలుగురు మరణించారు. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటి రేటు 0.32 శాతం ఉంది. దేశంలో 11,366 (0.03) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి 796 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,07,834 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,40,947 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,776 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీక్లీ పాజిటివిటీ రేటు 0.26 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 186.38,31,723 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 6,89,724 కోట్ల డోసులను పంపిణీ చేశారు.
దేశ వ్యాప్తంగా నిన్న 3,00,918 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 83.14 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
????? ?????https://t.co/zSoCZjL0hF pic.twitter.com/Frdrk6eMao
— Ministry of Health (@MoHFW_INDIA) April 16, 2022
Also Read: