India Corona : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఒక్కరోజే 312 మంది మృతి.. గడిచిన 24 గంటల్లో కేసుల వివరాలు..

|

Mar 28, 2021 | 11:21 AM

India Corona : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,714 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 312 మంది మృతి చెందినట్లు

India Corona : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఒక్కరోజే 312 మంది మృతి.. గడిచిన 24 గంటల్లో కేసుల వివరాలు..
India Corona
Follow us on

India Corona : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,714 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 312 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 1,19,71,624 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా కరోనా నుంచి1,13,23,762 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపింది. ఇక ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,61,552 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,86,310 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇప్పటి వరకు దేశంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 6,02,69,782 కు చేరినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రంగా ఉంది. శనివారం ఒక్కరోజే 35,726 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 166 మరణాలు నమోదు కాగా, 14,523 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 26.73లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 23.14లక్షల మంది కోలుకోగా.. 54,073 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3.04లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కాగా, దేశంలో గతంలో కంటే ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల వల్ల కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని, అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Pensions For Dogs, Horses : కుక్కలకు, గుర్రాలకు పెన్షన్.. పార్లమెంట్‌లో చట్టం.. విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

మరోసారి తెలంగాణలో గుబులు పుట్టిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 535 మందికి పాజిటివ్‌

అరవాలమ్మ తల్లి జాతరలో అశ్లీల నృత్యాలు.. ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర డాన్సులు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..