India Covid-19: దేశంలో నిన్న 3.5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో మరణాలు

|

Apr 26, 2021 | 10:01 AM

India Covid-19 updates: భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా

India Covid-19: దేశంలో నిన్న 3.5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో మరణాలు
covid dead body
Follow us on

India Covid-19 updates: భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా లక్షల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. రోజురోజూకు వీటి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుదున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఆదివారం దేశవ్యాప్తంగా 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2812 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,13,163 (1.73 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,95,123 కి చేరింది. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి.. అత్యధిక కోవిడ్ -19 కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.

ఇదిలాఉంటే.. నిన్న కరోనా నుంచి 2,19,272 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,43,04,382 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 28,13,658 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. ఆదివారం దేశవ్యాప్తంగా 14,02,367 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 25 వరకు మొత్తం 27,93,21,177 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 14,19,11,223 డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

 

Also Read:

Harsh Vardhan: అనవసర రాజకీయాలు చేస్తున్నారు.. ఆ వ్యాక్సీన్లన్నీ రాష్ట్రాలకే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ 

Corona Vaccine Registration: 18 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్నారా..! అయితే ఇలా పేర్లు నమోదు చేసుకోండి..