India Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

India Coronavirus: దేశంలో ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కరోనావైరస్ కేసుల సంఖ్య నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో

India Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

Updated on: Mar 17, 2022 | 10:05 AM

India Coronavirus Updates: కరోనా థర్డ్‌వేవ్ అనంతరం దేశంలో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఐదు వేలకు దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో బుధవారం దేశవ్యాప్తంగా 2,539 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.35 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 30,799 (0.07%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,24,59,939 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,16,132 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 4,491 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,54,546 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.72 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 180.80 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా.. నిన్న 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే 2.60 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించారు.

దేశ వ్యాప్తంగా నిన్న 7,17,330 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 78.12 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

Also Read:

India Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?

Hyperloop India: హైపర్‌లూప్ టెక్నాలజీపై ప్రయోగాలు.. సత్తా చాటిన చెన్నై ఐఐటీ విద్యార్థులు