India Covid-19: కేరళలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. దేశంలో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు..

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేశాయి. తాజాగా కేసుల సంఖ్య దేశంలో..

India Covid-19: కేరళలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. దేశంలో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు..
covid cases

Updated on: Oct 03, 2021 | 9:54 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేశాయి. తాజాగా కేసుల సంఖ్య దేశంలో దిగివస్తోంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 22,842 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 244 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,94,529 కి పెరగగా.. మరణాల సంఖ్య 2,70,557 కి చేరింది. నిన్న కరోనా నుంచి 25,930 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,70,557 కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న కోటిమందికి పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. కోటిమందికి పైగా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం ఇది ఐదోసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 90,51,75,348  కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి: Maharashtra NCB Raid: వీకెండ్‌ మత్తు మజాలో వాణిజ్య నగరం.. పట్టుబడిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో పుత్రరత్నం..