దేశంలో కొత్తగా 18,855 పాజిటివ్ కేసులు, 163 మరణాలు.. 97 శాతానికి చేరువైన రికవరీ రేటు..

Corona Cases India: దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే నిన్నటికి పాజిటివ్ కేసుల సంఖ్యలో 61 శాతం...

దేశంలో కొత్తగా 18,855 పాజిటివ్ కేసులు, 163 మరణాలు.. 97 శాతానికి చేరువైన రికవరీ రేటు..

Updated on: Jan 29, 2021 | 11:26 AM

Corona Cases India: దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే నిన్నటికి పాజిటివ్ కేసుల సంఖ్యలో 61 శాతం పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,855 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,20,048కి చేరింది.

నిన్న కొత్తగా 20,746 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,03,94,352 కోలుకున్నారు. కాగా, బుధవారం ఒక్కరోజే 163 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,54,010కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,71,686 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో నిన్నటి వరకు 29,28,053 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి…

హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!

మదనపల్లె డబుల్ మర్డర్.. కేసులో కొత్త ట్విస్ట్.. సీన్‌లోకి భూతవైద్యుడు ఎంట్రీ.. ఆ కొమ్ము ఊదింది ఎవరు.?

ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..

Follow Us