India Covid-19: దేశ ప్రజలకు ఉపశమనం.. భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Coronavirus Updates: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు

India Covid-19: దేశ ప్రజలకు ఉపశమనం.. భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona

Updated on: Sep 28, 2021 | 10:05 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేశాయి. తాజాగా కేసుల సంఖ్య దేశంలో దిగివస్తోంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 18,795 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,97,581 కి పెరగగా.. మరణాల సంఖ్య 2,92,206 కి చేరింది. నిన్న కరోనా నుంచి 26,030 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 32,9,58,002 కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,92,206 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దాదాపు 201 రోజుల అనంతరం కొత్త కేసులు 20 వేలకు దిగువన నమోదుకావడం ఇదే తొలిసారి.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న కోటిమందికి పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. కోటిమందికి పైగా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం ఇది ఐదోసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 87,07,08,636 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. గడిచిన 24 గంటల్లో 1,02,22,525 మందికి కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

PM Modi: రైతులకు నిజంగా శుభవార్త.. 35 రకాల పంటలను జాతీయం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ..

Nitin Gadkari J&K Visit LIVE: జోజిలా టన్నెల్‌ను మరికాసేపట్లో సందర్శించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మేఘా ప్రతినిధులతో భేటీ..