Covid 4th Wave: ఫోర్త్ వేవ్ అలర్ట్.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఎన్నంటే..?

|

Jul 13, 2022 | 10:03 AM

India Coronavirus: గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 16 వేలకు పైగా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

Covid 4th Wave: ఫోర్త్ వేవ్ అలర్ట్.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఎన్నంటే..?
India Corona
Follow us on

India Covid-19 Updates: దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 16 వేలకు పైగా నమోదైంది. మంగళవారం దేశవ్యాప్తంగా 16,906 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 45 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,32,457 (0.30 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.68 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.49 శాతం ఉంది.

దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,36,69,850 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,519 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 15,447 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,30,11,874 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 199.12 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 11,15,068 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి