India Covid-19: దేశంలో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. 5 లక్షలు దాటిన మృతుల సంఖ్య

|

Feb 04, 2022 | 9:44 AM

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇటీవల ఎన్నడూ లేని విధంగా మూడు లక్షలకు పైగా రోజువారి కేసులు నమోదయ్యాయి.

India Covid-19: దేశంలో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. 5 లక్షలు దాటిన మృతుల సంఖ్య
Coronavirus
Follow us on

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇటీవల ఎన్నడూ లేని విధంగా మూడు లక్షలకు పైగా రోజువారి కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో (గురువారం) కేసుల సంఖ్య రెండు లక్షలకు దిగువగానే నమోదైంది. నిన్న కేసుల స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా 1,49,394 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోల్చుకుంటే (23 వేల కేసులు) 13% శాతం కేసులు తగ్గాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి (Covid-19) కారణంగా నిన్న 1072 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో నమోదైన మరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటుండంతో మరణాల సంఖ్య గణాంకాల్లో ఎక్కువగా నమోదవుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ( Health Ministry) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 2,46,674 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,35,569 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 5,00,055 బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 168.47 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Fact Check: వ్యాక్సిన్‌పై వస్తున్న ఆ వార్తలను అస్సలు నమ్మోద్దు.. కేంద్రం కీలక ప్రకటన..

ICC U 19 World Cup: ఫైనల్లో ఇలా ఆడితే.. విజయం మీ సొంతం: కుర్రాళ్లకు విరాట్ కోహ్లీ కీలక సూచనలు