Covid 4th Wave: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..

Covid 4th Wave in India: సోమవారం దేశవ్యాప్తంగా 11,793 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 27 మంది మరణించారు.

Covid 4th Wave: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..
India Corona

Updated on: Jun 28, 2022 | 9:44 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 12 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. సోమవారం దేశవ్యాప్తంగా 11,793 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 27 మంది మరణించారు. నిన్నటి పోల్చుకుంటే కేసుల సంఖ్య 5,280 కేసులు తగ్గగా.. 6 మరణాలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 96,700 (0.22 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో పాజిటివిటీ రేటు 4.40 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.57 శాతం ఉంది.

దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,18,839 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,047 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 9,486 మంది బాధితులు కోలుకున్నారు.
  • కోలుకున్న వారి సంఖ్య 4,27,97,092 6కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 197,31 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 19,21,811 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..