JP దత్తా దర్శకత్వం వహించిన మల్టీ స్టారర్ బాలీవుడ్ చిత్రం ‘బోర్డర్’ నేటికీ ప్రజాధారణ సొంతం చేసుకుంటూనే ఉంది. ఈ సినిమాలో సునీల్ శెట్టి.. ఒక రియల్ ఆర్మీ జవాన్ పాత్ర అన్న సంగతి తెలిసిందే..1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరోన్ సింగ్ రాథోడ్ పాత్రను బోర్డర్ మూవీలో సునీల్ శెట్టి పోషించారు.. భైరోన్ సింగ్ రాథోడ్ (రిటైర్డ్) కన్నుమూశారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. భైరాన్ సింగ్ ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకున్నారనే వార్త తనకు చాలా బాధకలిగించిందని సునీల్ శెట్టి పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.
సోమవారం భైరోన్ సింగ్ చిత్రంతో బీఎస్ఎఫ్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో, “1971 లోంగేవాలా యుద్ధం వీరుడు నాయక్ భైరోన్ సింగ్ (రిటైర్డ్) మృతికి BSF DG సహా అన్ని స్థాయిల అధికారులు సంతాపం తెలిపారు. BSF వీరుల ధైర్యసాహసాలను విధి పట్ల అంకితభావాన్ని గౌరవిస్తుందని ఈ కష్టకాలంలో భైరోన్ సింగ్ కుటుంబానికి కుటుంబం అండగా నిలుస్తోందని చెప్పారు.
సునీల్ శెట్టి సంతాపం
బోర్డర్ చిత్రంలో సునీల్ శెట్టి భైరోన్ సింగ్ పాత్రలో నటించారు. అయితే సినిమాలో శత్రువుతో పోరాడుతూ అమరవీరుడు అవుతాడు. ఇప్పుడు భైరోన్ సింగ్ మృతి పట్ల సునీల్ శెట్టి సంతాపం వ్యక్తం చేశారు. BSF ట్వీట్‌ను కోట్ చేస్తూ, “రెస్ట్ ఇన్ పవర్ భైరాన్ సింగ్ జీ.. అంటూ అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Rest in Power Naik Bhairon Singh Ji. Heartfelt condolences to the family ? https://t.co/5A531HeouG
— Suniel Shetty (@SunielVShetty) December 19, 2022
1971 ఇండో-పాక్ యుద్ధంలో హీరో భైరోన్ సింగ్
1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో లోంగేవాలాలో భైరోన్ సింగ్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిసెంబర్ 16న ప్రధాని మోడీ కూడా భైరోన్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆయన పరిస్థితిని తెలుసుకున్నారు. 81 ఏళ్ల వయసులో ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు.
DG BSF & all ranks condole the passing of Naik (Retd) Bhairon Singh, Sena Medal, the hero of #Longewala battle during 1971 War. BSF salutes his intrepid bravery, courage & dedication towards his duty.
Prahari parivar stands by his family in these trying times.#JaiHind pic.twitter.com/nzlqNJUi9K— BSF (@BSF_India) December 19, 2022
ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన బోర్డర్ చిత్రంలో సన్నీ డియోల్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, జాకీ ష్రాఫ్, సుధేష్ బెర్రీ, కులభూషణ్ ఖర్బండా, టబు, పూజా భట్ వంటి చాలా మంది నటీనటులు కనిపించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు, JP దత్తా స్క్రీన్‌ప్లే కూడా రాశారు. 1997లో వచ్చిన ఈ సినిమా దేశప్రజల్లో గర్వాన్ని నింపింది. నేటికీ ఈ చిత్రం భారతదేశపు యుద్ధ చిత్రాలలో అగ్రస్థానంలో ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..