IAF: ఆపరేషన్ సింధూర్‌పై భారత వాయుసేన కీలక ప్రకటన.. ఇంకా ముగియలేదంటూ..

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా కొనసాగుతోందని భారత వాయుసేన స్పష్టం చేసింది. ప్రధాని మోదీ అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహించామని పేర్కొంది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్‌పై ఎక్స్‌ వేదికగా కీలక విషయాలు వెల్లడించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌.

IAF: ఆపరేషన్ సింధూర్‌పై భారత వాయుసేన కీలక ప్రకటన.. ఇంకా ముగియలేదంటూ..
Operation Sindoor

Updated on: May 11, 2025 | 1:00 PM

కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే ఆపరేషన్ సింధూర్‌ ఆగిపోయిందా? అందరికీ వస్తోన్న డౌట్‌ ఇదే. కానీ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాత్రం మరో మాట చెబుతోంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా కొనసాగుతోందని భారత వాయుసేన స్పష్టం చేసింది. ప్రధాని మోదీ అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహించామని పేర్కొంది. కచ్చితత్వం, నైపుణ్యంతో ఆపరేషన్ నిర్వహించినట్లు వాయుసేన ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్‌పై ఎక్స్‌ వేదికగా కీలక విషయాలు వెల్లడించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌. దీనిపై పూర్తి వివరాలు మరికాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించనుంది భారత వాయుసేన. ఎంతో సావధానంగా, జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వాహణ జరిగిందని.. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఆపరేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహించమని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్‌పై ఊహాగానాలు, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని IAF విజ్ఞప్తి చేసింది.