
భారత్ – పాకిస్తాన్ కాల్పుల విరమణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదంటూ పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ.. త్రివిధ దళాలకు కీలక ఆదేశాలిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. పాక్ నుంచి కాల్పులు జరిపితే భారత్ కూడా జరుపుతుందన్నారు. పాక్ దాడులు జరిపితే..భారత్ కూడా దాడులకు దిగుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు.. గట్టిగా జవాబిస్తామన్నారు. ఈ సందర్భంగా పీవోకేపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటేనన్నారు. పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదంటూ పేర్కొన్నారు. పీవోకే అంశంలో మధ్యవర్తులు మాకొద్దంటూ నొక్కిచెప్పారు. పాకిస్తాన్ పీఓకే, ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనంటూ స్పష్టంచేశారు. మా సంయమనం బలహీనత కాదని.. భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
The situation worsened for Pakistan in every round; they lost to India in every round of the battle. After our strikes on Pakistan air bases, Pakistan has realised they are not in this league. A clear message was given by India, no one is safe, it is the new normal: Sources https://t.co/x516pQ7mzl
— ANI (@ANI) May 11, 2025
ప్రతి రౌండ్‌లోనూ పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారింది.. యుద్ధంలోని ప్రతి రౌండ్‌లోనూ వారు భారతదేశం చేతిలో ఓడిపోయారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడుల తర్వాత చేతులెత్తిసింది.. పాకిస్తాన్ ఈ పోటీలో లేదని గ్రహించింది. అక్కడ ఎవరూ సురక్షితంగా లేరని భారతదేశం స్పష్టమైన సందేశం ఇచ్చింది.. అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం ద్వారా భారతదేశం ఈ మూడు లక్ష్యాలను సాధించింది.
సైనిక లక్ష్యం- ‘మిట్టి మే మిలా దేంగే, బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్ క్యాంప్ కో మిట్టి మే మిలా దియా’ అని ప్రధాని మోదీ అన్నారు.
రాజకీయ లక్ష్యం – సరిహద్దు దాటి ఉగ్రవాదానికి సంబంధించిన సింధు జల ఒప్పందం. సరిహద్దు దాటి ఉగ్రవాదం ఆగిపోయే వరకు ఇది నిలిపివేయబడుతుంది.
మానసిక లక్ష్యం- ‘ఘుస్ కే మారేంగే’, మేము వారి దేశంలో లోపలికి వెళ్లి దాడి చేసాము. మేము చాలా విజయవంతమయ్యాము.. అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..