Heatstroke: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. అక్కడ వడదెబ్బతో 13 మంది మృతి

ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. భారీ ఎండల కారణంగా ఎంతో మంది తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. ముంబయిలో వడదెబ్బతో 13 మంది మృతి చెందారు. అవసరమైతే తప్పా బయటకు రావద్దని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా కొన్ని..

Heatstroke: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. అక్కడ వడదెబ్బతో 13 మంది మృతి
Heat

Updated on: Apr 19, 2023 | 4:00 PM

ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. భారీ ఎండల కారణంగా ఎంతో మంది తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. ముంబయిలో వడదెబ్బతో 13 మంది మృతి చెందారు. అవసరమైతే తప్పా బయటకు రావద్దని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరులో 44 డిగ్రీలు దాటుతోంది ఉష్ణోగ్రత. వడదెబ్బ తగలకండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో 42 డిగ్రీల ఉష్షోగ్రత నమోదైంది. అధిక ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. సింగరేణి ప్రాంతంలో వడ గాలులు వేగంగా విస్తున్నాయి. భారీ వడగాల్పులకు జనం అస్వస్థకు గురవుతున్నారు. వ్యవసాయ పనులకు కూలీలు రావడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి