Coronavirus Vaccination in India: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనతికాలంలోనే భారత్ మరో రికార్డును నెలకొల్పింది. జనవరి 16న ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ శుక్రవారం సాయంత్రం నాటికి కోటిమందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి మన్‌దీప్ బండారి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వరకు 1,04,49,942 మందికి టీకాలు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో 33,97,097 మంది ఫ్రంట్‌లైన్ సిబ్బంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే కరోనా టీకా తీసుకున్న అనంతరం పలు కారణాలతో 41 మంది ఆసుపత్రిలో చేరారని.. వారిలో అందరూ డిశ్చార్జ్ కాగా.. ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 14 మంది మరణించారని వారంతా కోవిడ్ టీకా వల్ల మరణించినట్లు నిర్థారణ కాలేదని తెలిపారు.
అయితే మొదటి దశలో 70,52,845 మంది ఆరోగ్య కార్యకర్తలకు టాకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 62,95,903 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. ఇక రెండో దశలో 7,56,942 ఆరోగ్య కార్యకర్తలకి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోని ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా 12 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అనుకున్న లక్ష్యానికి 75 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
ఇందులో బిహార్‌లో అత్యధికంగా 84.7 శాతం, త్రిపుర 82.9 శాతం, ఒడిశా 81.8 శాతం, లక్ష్యదీవులు 81 శాతం, గుజరాత్ 80.1 శాతం, ఛత్తీస్‌ఘఢ్ 79.7 శాతం, ఉత్తరాఖండ్ 77.2 శాతం, మధ్యప్రదేశ్ 77 శాతం, జార్ఖండ్ & ఉత్తరప్రదేశ్ 75.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ 75.4 శాతం, రాజస్తాన్ 75 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని మన్‌దీప్ బండారి తెలిపారు.
Also Read: