India Corona Updates: దేశంలో కొత్తగా 19,740 పాజిటివ్ కేసులు.. 248 మంది మృతి.. పూర్తివివరాలివే..

India Corona Updates: దేశంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 30 వేల కేసుల నుంచి 19 వేలకు పడిపోయింది.

India Corona Updates: దేశంలో కొత్తగా 19,740 పాజిటివ్ కేసులు.. 248 మంది మృతి.. పూర్తివివరాలివే..
India Corona

Updated on: Oct 09, 2021 | 9:59 AM

India Corona Updates: దేశంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 30 వేల కేసుల నుంచి 19 వేలకు పడిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,740 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలో కరోనా కారణంగా 248 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తాజాగా నమోదైన కేసులు.. గత 206 రోజులతో పోలిస్తే చాలా తక్కువ. ఇక 24 గంటల్లో 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దేశంలో 3,32,48,291 లకు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 2,36,643 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. భారతదేశంలో ఇప్పటి వరకు 93,99,15,323 మందికి కరోనా టీకాలు వేశారు.

కాగా, గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు 3,39,35,309 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో కరోనా పాజిటివ్ రేట్ ఒక శాతం కంటే తక్కువగా(0.70%) ఉంది. అదే సమయంలో రికవరీ రేటు 97.98 శాతంగా ఉంది. ఇది మార్చి 2020 తర్వాత అత్యధికం. దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.62 శాతం కాగా, ఇది గత 106 రోజుల్లో 3% కంటే తక్కువగా ఉంది. రోజువారీ కరోనా పాజిటివ్ రేటు 1.56 శాతంగా నమోదైంది. ఇది గత 40 రోజులలో 3 శాతం కంటే తక్కువ. ఇప్పటివరకు, భారతదేశంలో మొత్తం 58.13 కోట్ల సాంపిల్స్ పరీక్షించారు.

సంక్షిప్తంగా కరోనా వివరాలు..
మొత్తం కేసులు: 3,39,35,309
యాక్టివ్ కేసులు: 2,36,643
మొత్తం రికవరీ: 3,32,48,291
మొత్తం మరణాలు: 4,50,375
మొత్తం టీకాలు: 93,99,15,323

రాష్ట్రాల విషయానికి వస్తే..
దేశ వ్యాప్తంగా కేరళలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 10,944 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా కారణంగా 120 మంది ప్రాణాలు కోల్పోయారు. 12,922 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తతుం కేరళలలో 1,16,645 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు, కేరళలో 46,31,330 మంది కరోనానుంచి కోలుకోగా.. 26,072 మంది మరణించారు.

Also read:

Siddharth: నేను తెలుగు స్టార్‌ని.. టాలీవుడ్ ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు : సిద్దార్థ్

Viral Video: దుబాయ్‌లో మనోళ్ళకు తగిలిన రూ. 20 కోట్ల లాటరీ! వీడియో

13 బంతుల్లో పెను విధ్వంసం.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు..