గడిచిన 24 గంటల్లో రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు.. కరోనా నిబంధనలు పాటించపోతే మరింత ప్రమాదంమంటున్న నిపుణులు

|

Apr 01, 2021 | 10:36 AM

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మళ్లీ రోజురోజుకు రికార్డు స్థాయిలో...

గడిచిన 24 గంటల్లో రికార్డ్‌ స్థాయిలో కరోనా కేసులు.. కరోనా నిబంధనలు పాటించపోతే మరింత ప్రమాదంమంటున్న నిపుణులు
Coronavirus
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మళ్లీ రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 72,330 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 459 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 1,22,21,665 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 1,62,927కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,14,74,683 మంది రికవరీ కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,84,055 ఉంది. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 6,51,17,896 మందికి వ్యాక్సిన్‌ అందించారు.

మరింత అప్రమత్తంగా ఉండాలి- నిపుణులు

కాగా, దేశంలో సెకండ్‌వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన మాస్కులు ధరించకపోవడం, కరోనా నిబంధనలు పాటించకపోవడం కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా అవుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. కరోనా నిబంధనలు పాటించపోతే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రానున్న నెలల్లో వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి: Covid-19: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం.. 30 మందికి పాజిటివ్‌

Coronavirus: ఏపీఆర్టీసీ బస్ భవన్‌లో కరోనా కలకలం.. 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌.. ఆందోళనలో సిబ్బంది

Coronavirus: పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 39,544 పాజిటివ్‌ కేసులు.. ఎంత మంది మరణించారంటే.