India Corona Updates: భారత్‌లో కరోనా విలయతాండవం.. దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు

|

May 05, 2021 | 10:38 AM

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి..

India Corona Updates: భారత్‌లో కరోనా విలయతాండవం.. దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు
India Corona Updates
Follow us on

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్త గా 3,82,315 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,780 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 2,06,65,148 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాలు 2,26,188కి చేరుకున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3,38,439 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు మొత్తం 1,69,51,731 మంది కోలుకున్నారు. ఇక యాక్టివ్‌ కేసులు 34,87,229 ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 16,04,94,188 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా, నిన్న 3,57,229 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా,3,449 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నిన్నటికంటే ఈ రోజు కేసులు, మరణాలు పెరిగాయి..

ఇవీ కూడా చదవండి:

Portable Oxygen Concentrators: పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌.. గాలి నుంచి ఆక్సిజన్‌ సేకరించే యత్రం

Hand Hygiene day: జర భద్రం.. చేతులను శుభ్రం చేసుకుంటే ఉపయోగాలు ఏమిటి.? నేడు చేతుల పరిశుభ్రత దినోత్సవం