దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,640 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 91 రోజుల్లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,77,861కి చేరింది. ఇందులో 6,62,521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 81,839 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,89,26,038కి చేరింది.
Also Read: Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!
అటు నిన్న 1,167 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,89,302 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 28,87,66,201 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ షూరు అయింది. లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నా.. కరోనా నియంత్రణకు ఐదు సూత్రాలు పాటించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తోంది.
Also Read: రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!
మరోవైపు కరోనా తగ్గుముఖం పట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను షూరూ చేశాయి. ఇవాళ్టి నుంచి తెలంగాణ పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేయగా.. ఏపీలో సడలింపుల సమయాన్ని పెంచింది జగన్ సర్కార్. తూర్పుగోదావరి మినహయించి మిగతా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపుల సమయాన్ని పెంచింది. తూర్పుగోదావరిలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఇవ్వగా.. ఆ తర్వాత కఠిన లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ నిబంధనలు జూన్ 30 వరకు వర్తిస్తాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.