దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,23,22,258 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,64,129 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,15,25,080 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలా ఉంటే నిన్న 530 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,33,049కి చేరింది. అటు గత 24 గంటల్లో 39,157 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.13 శాతంగా ఉండగా.. రికవరీ రేట్ 97.53 శాతంగా ఉంది.
మరోవైపు నిన్న ఒక్క రోజులో 56,36,336 మందికి టీకా వేయగా.. ఇప్పటిదాకా 56,64,88,433 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. నిన్న 21,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో కూడా గడిచిన 24 గంటల్లో 5,132 కరోనా కేసులు బయటపడ్డాయి.
Also Read:
ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..
ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?
India reports 36,401 new #COVID19 cases and 39,157 recoveries in the last 24 hrs, as per Health Ministry
Total recoveries: 3,15,25,080
Active cases: 3,64,129 (lowest in 149 days) pic.twitter.com/C3dWPTXPov— ANI (@ANI) August 19, 2021