India Corona Cases: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృ‌తి.. కేసుల్లో హెచ్చుతగ్గులు.. కొత్తగా ఎన్నంటే.!

|

Aug 05, 2021 | 10:53 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్...

India Corona Cases: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృ‌తి.. కేసుల్లో హెచ్చుతగ్గులు.. కొత్తగా ఎన్నంటే.!
India Corona Updates
Follow us on

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,18,12,114 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,11,076 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,09,74,748 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉంటే నిన్న 533 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,26,290కి చేరింది. అటు బుధవారం 41,726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేట్ 97.37 శాతంగా ఉంది.

మరోవైపు నిన్న ఒక్క రోజులో 37,55,115 మందికి టీకా వేయగా.. ఇప్పటిదాకా 48,93,42,295 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు 51.01 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఇప్పటిదాకా పంపిణీ అయిన, వృధా అయిన టీకాల మొత్తం 48,60,15,232గా ఉందని వెల్లడించింది.